Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ లో ఒక్కడైన నిఖిల్ పెళ్ళికొడుకు అవుతున్నాడు. ఇది సినిమా వార్త కాదండోయ్. నిజంగానే నిజం. ఎప్పటినుంచో నిఖిల్ పెళ్లి గురించి అడపాదడపా వార్తలు వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు నిఖిల్ పెళ్లి గురించి గట్టి కబురు అందింది. నిఖిల్ కి వారి బంధువుల అమ్మాయి తోనే పెళ్లి ఫిక్స్ అయ్యింది. అమ్మాయి పేరు తేజస్విని అట. ఈ నెల 24 న హైదరాబాద్ లోని ఓ హోటల్ లో వీరి నిశ్చితార్ధం జరుగుతుందట. అక్టోబర్ 1 న నిఖిల్ పెళ్లి జరుగుతుందట. పెళ్ళికొడుకు మామగారు పేరు ఆంజనేయులట. నగరంలో ఆయనకి కొన్ని వ్యాపారాలు వున్నాయట.నిఖిల్ ప్రస్తుతం నిశ్చితార్ధం పనుల్లో బిజీగా వున్నారు.
మరిన్ని వార్తలు: