రౌడీ హీరో మ‌రో లుక్‌

రౌడీ హీరో మ‌రో లుక్‌

రౌడీ హీరో అని అభిమానులు ప్రేమతో పిలుచుకునే హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముంబైలో ఎక్కువ భాగం చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్ ఎఫెక్టుల‌తో సినిమా షూటింగ్ ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు బుధ‌వారం ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించిన‌ట్లు నిర్మాత‌ల్లో ఒక‌రైన ఛార్మి తెలియ‌జేశారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే టైటిల్ లుక్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మ‌రో లుక్‌ను వెనుక సైడ్ నుంచి తీసిన ఫొటోగా ఛార్మి విడుద‌ల చేసింది. బీస్ట్‌లుక్‌లో మా లైగ‌ర్ అంటూ ఛార్మి విడుద‌ల చేసిన స‌ద‌రు లుక్ వెనుక నుంచి చూస్తుంటే మెలితిరిగిన కండ‌ల‌తో కూర్చున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, హెయిర్ స్టైల్ చాలా కొత్తగా ఉంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగు, హిందీల్లో తెర‌కెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇస్మార్ట్ శంక‌ర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఇమేజ్ వంటి విష‌యాలు క‌లిపి సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.