తమిళ హీరో విశాల్ వచ్చే ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పటికే నిర్మాతల సంఘం, నడిఘర్ సంఘం ఎన్నికలలో అధ్యక్షుడిగా గెలిచాడు. అయితే గత ఎన్నికలలో ఆర్.కే. నగర్ అసెంబ్లీ నుంచి పోటి చేయాలని విశాల్ నామినేషన్ కూడా దాఖలు చేశాడు.
అయితే చివరి క్షణంలో నామినేషన్ ప్రతిపాదించిన 10 మందిలో కొంతమంది తమ మద్ధతును ఉపసంహరించుకోవడంతో ఎన్నికల అధికారులు విశాల్ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో ఆ ఎన్నికలలో విశాల్ పోటీ చేయలేకపోయారు. అయితే ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన విశాల్ తన అభిమాన సంఘాలతో చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.