కరోనా భయంతో ఆదివారం దేశమంతా జనతా కర్ఫ్యూను పాటించిన సంగతి తెలిసిందే. ప్రధాన పిలుపుతో దేశంలోని ప్రతీ ఒక్కరు స్వీయ నియంత్ర పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. అంతేకాదు సాయంత్రం 5 గంటలకు అంతా తమ ఇంటి బాల్కనీల్లోకి వచ్చిన ఈ కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజాసేవలో నిమఘ్నమైన డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ కార్మికులకు సంఘీభావం తెలిపారు.
పలువురు సెలబ్రిటీలు కూడా సంఘీభావంగా కిటికీలు బాల్కనీల దగ్గర చప్పట్లు కొడుతూ తమ మద్ధతు ప్రకటించారు. అమితాబ్ బచ్చన్ లాంటి మెగాస్టార్ నుంచి సాధారణ పౌరుల వరకు ప్రతీ ఒక్కరు ఈ సంఘీభావ ప్రకటనలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్ మరో గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఎమోషనల్ అయ్యింది.
ఒక్కసారిగా దేశమంత ఒక్కతాటి మీదకు వచ్చి అసలైన హీరోలకు సంఘీభావం తెలపటంతో ఉద్వేగానికి లోనూన ప్రగ్యా కన్నీరు పెట్టుకుంది. తాను కూడా వారికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ చప్పట్లు కొడుతూ కన్నీరు పెట్టుకున్న వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.