అందంతో పాటు అందమైన మనసున్న ప్రణీత

అందంతో పాటు అందమైన మనసున్న ప్రణీత

ఏ ముహూర్తాన ‘అమ్మో.. బాపుగారి బొమ్మ’ అంటూ ప్రణీత కోసం పాట రాశారో గానీ అప్పటి నుంచి ఆ పేరే ఫిక్స్ అయింది. ఇంత వరకు అందంలోనే ప్రణీత గొప్ప అనుకున్నారు. కానీ సాయం చేయడంలో.. పది మంది కోసం నిలబడటంతో అందంతో పాటు మంచి మనసుందని తెలుసుకున్నారు. తానే సొంత ఖర్చుతో స్వయంగా వంట చేసి మరి చాలా మంది ఆకలి తీరుస్తుంది. లాక్ డౌన్ మొదలైన తరవాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసింది. దీనితో అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందంతో పాటు అందమైన మనసుందని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ప్రణీత ఇప్పటికే టాలీవుడ్ లో పేద సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసెస్ ఛారిటీకి అందరు హీరోయిన్స్ కంటే ముందుగా లక్ష రూపాయలను ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కన్నా.. ప్రతీణ వంద రెట్లు మేలని అందరూ ఆమెని కొనియాడారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రణీత మాట్లాడుతూ తనకు పబ్లిసిటీ చేసుకోవడం నచ్చదని తెలిపింది. తాను ఏ పని చేసినా సీక్రెట్గా ఉంచుతానని పేర్కొంది. డాక్టర్లైన మా తల్లిదండ్రుల కారణంగా సమాజ సేవపై ఆసక్తి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికే రెండు స్కూళ్లను దత్తత తీసుకున్నానని తెలిపింది. కరోనా కోసం మరో 8 లక్షల ఫండ్ను కలెక్ట్ చేశానని పేర్కొంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. ఆయనలోని సెన్సాఫ్ హ్యూమర్ ఎంతో ఇష్టమని తెలిపింది.

ఎన్టీఆర్ గురించి చెబుతూ.. ఆయన డైలాగ్ చెప్పే విధానం ఇష్టమని చెప్పుకొచ్చింది. ఆయన డైలాగ్ లైన్స్ చెబుతూ ఉంటే షాక్ అయ్యేదాన్ని.. ఆయనో అరుదైన నటుడని కొనియాడింది. ‘అత్తారింటికి దారేది’ లాంటి పెద్ద హిట్ తరువాత టాలీవుడ్ లో అంతగా నటించకపోవడానికి గల కారణాలను చెబుతూ.. ఆ సినిమా తరువాత కన్నడ తమిళంలో బాగా అవకాశాలు వచ్చాయని.. తెలుగులో చెప్పుకోదగ్గ పాత్రలు రాకపోడంతో ఎక్కువగా చేయలేకపోయానని తెలిపింది. అంతేకాకుండా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నానని.. రెండు చిత్రాల్లో నటిస్తున్నానని పేర్కొంది. అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న ‘భుజ్’ మరియు ‘హంగామా 2’ చిత్రాల్లో నటిస్తున్నానని వెల్లడించింది. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేసింది.