ప్రభుత్వం పై మండిపడ్డ కమల్ హాసన్

ప్రభుత్వం పై మండిపడ్డ కమల్ హాసన్

లాక్ డౌన్ లో సడలింపులు చేసిన కేంద్రం.. మద్యం అమ్మకాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గ్రీన్ ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలను తాజాగా దేశంలోని రాష్ట్రాలు ప్రారంభించాయి.దీంతో దేశంలోని ఆయా రాష్ట్రాల్లో వైన్ షాపుల ఎదుట మందుబాబుల జాతర కొనసాగుతోంది. ఈ ఫొటోలు వీడియోలు ఇంటర్నెట్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మద్యం ద్వారా ఒక్కరోజులో ఏకంగా 45 కోట్ల ఆదాయం వచ్చింది.

అయితే దాని పక్కనున్న తమిళనాడులో మాత్రం మే 7వరకు లాక్ డౌన్ విధించారు. అక్కడ మద్యం విక్రయాలు ఇంకా ప్రారంభించలేదు. పక్కనున్న ఏపీ కర్ణాటకలో ప్రారంభించడంతో ఇప్పుడు తమిళనాడులో కూడా మే 7నుంచి మద్యం ప్రారంభించేందుకు సర్కార్ రెడీ అయ్యింది.

తమిళనాడులో మద్యం అమ్మకాలపై తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ మండిపడ్డారు.లాక్ డౌన్ కరోనా వ్యాప్తి వేంగా ఉన్న తరుణంలో మద్యం అమ్మకాల నిర్ణయాన్ని తప్పుపట్టారు. మద్యం దుకాణాలను తిరిగి ప్రారంభించి ప్రజారోగ్యంతో ఆటలు ఆడుతున్నారా అంటూ కమల్ ప్రశ్నించారు.

దేశంలో రాష్ట్రంలో కరోనా అంతకంతకూ పెరుగుతుంటే నిబంధనలు కఠినతరం చేయాల్సింది పోయి మద్యం షాపులు తెరిచి ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతారా అని విమర్శించారు. మద్యం దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం కష్టమని.. దీని వల్ల ఆ వ్యక్తికే కాదు.. అతడి కుటుంబానికి కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని.. వెంటనే ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్ణయాన్ని విరమించుకోవాలని కమల్ డిమాండ్ చేశారు.