మహేష్‌ 27.. అర్జున్‌ రెడ్డి, కాజల్‌!!

heroine Kajal Agarwal in mahesh babu and Sandeep Vanga movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా ఇటీవలే తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో మహేష్‌బాబు తర్వాత సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మహేష్‌బాబు తర్వాత సినిమా ఆయన కెరీర్‌లో 25వ చిత్రం అవ్వడం వల్ల కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మహేష్‌బాబు 25వ చిత్రం వచ్చే నెల రెండవ వారం నుండి ప్రారంభం కాబోతుంది. ఇక మహేష్‌ 26వ చిత్రం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి ప్రారంభం కాబోతుంది. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారు ఆ సినిమాను నిర్మించబోతున్నారు.

మహేష్‌ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత అంటే మహేష్‌ 27వ చిత్రంగా అర్జున్‌ రెడ్డి దర్శకుడితో సినిమా రాబోతుంది. ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయిన దర్శకుడు సందీప్‌ చాలా కాలంగా మహేష్‌బాబుతో సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకు మహేష్‌బాబును తన స్క్రిప్ట్‌తో ఒప్పించి సినిమాకు సైన్‌ చేయించుకున్నాడు. డేట్లు కూడా ఇచ్చేసిన మహేష్‌బాబు సందీప్‌ చిత్రంలో ఒక కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్‌బాబుతో సందీప్‌ తెరకెక్కించబోతున్న సినిమాలో హీరోయిన్‌గా కాజల్‌ను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాలు వచ్చి సక్సెస్‌ను దక్కించుకున్నారు. మరోసారి వీరి కాంబో సక్సెస్‌ అవుతుందేమో చూడాలి. అర్జున్‌ రెడ్డి తర్వాత మరో సినిమాకు కమిట్‌ కాని ఈ దర్శకుడు డైరెక్ట్‌గా సూపర్‌ స్టార్‌తో సినిమాకు రెడీ అయిపోయాడు.