అశ్విన్ బాబు,నందితా శ్వేత లు హీరో హీరోయిన్ లుగా , అనీల్ కన్నెగంటి దర్శకత్వం లో వస్తున్న చిత్రం “హిడింబ” . హిడింబ అనే పదానికే ఎంతో చరిత్ర ఉంది. మహా భారతంలో హిడింబ అనే పదం వినే ఉంటారు. అయితే అంతటి ప్రాధాన్యం ఉన్న హిడింబను టైటిల్‌గా పెట్టే సరికి అందరిలోనూ ఇంట్రెస్ట్ కలిగింది. ఆ కథకు, వీరు చెప్పబోయే కథకు ఏమైనా లింక్ ఉంటుందా?
అని ప్రేక్షకులు అనుకున్నారు. ఇక టీజర్, ట్రైలర్ అయితే అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. మరి అశ్విన్ బాబు ఈ హిడింబతో ఏం చేశాడు? ప్రేక్షకులను మెప్పించాడా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.హిడింబ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తదే. నరమాంస భక్షకురాలు ప్రస్తుత సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది?
అనే కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. దాని కోసం సెటప్ చేసుకున్న థీమ్ కూడా బాగానే ఉంది. కాలాబండను ప్రశాంత్ నీల్ కేజీయఫ్ స్టైల్లో బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు. అసలు ఈ కథను దర్శకుడు ఎలా చెప్పాలనే విషయంలోనే కన్ఫ్యూజ్ అయినట్టుగా, అలాంటి గందరగోళంలోనే సినిమా తీసేసినట్టు అనిపిస్తుంది.?
సిటీలో వరుసగా అమ్మాయిల కిడ్పాప్లు జరుగుతుంటాయి. కిడ్పాప్ అయిన అమ్మాయిల ఆచూకిని పోలీసులు కూడా పట్టుకోలేకపోతారు. దీంతో సీఎం, డీజీపీల మీద ఒత్తిడి పెరుగుతుంది. దీంతో స్పెషల్ ఆఫీసర్‌గా ఆద్య (నందితా శ్వేత) వస్తుంది. అప్పటికే కేస్‌ను లీడ్ చేస్తున్న అభయ్ (అశ్విన్ బాబు)ని ఆద్యతో కలిసి పని చేయాల్సిందిగా పై అధికారులు ఆర్డర్ వేస్తారు.
ఆద్యతో అభయ్ కలిశాక చేసిన పనులేంటి? అసలు అమ్మాయిల కిడ్నాప్ వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి? మధ్యలో బోయ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అసలు ఈ కథలోకి హిడింబలు ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ నర మాంస భక్షకులను ఎలా అంతమొందించారు? అనేది కథ. జులై 20 విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది .