1950 లో జన్మించిన వాళ్ళ కంటే కూడా 1990 లో జన్మించిన వాళ్ళ పై రెండు రెట్లు ఈ పెద్దపేగు క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా నాలుగు రెట్లు రెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తుంటే షుగర్ స్వీటెనర్స్ వాడడం తగ్గినట్టు కనబడుతోంది.ఏది ఏమైనా ఆరోగ్యానికి హాని కలిగించే వాటికి దూరంగా ఉండటం మంచిది. అయితే దీనిలో ఏకంగా 94 వేల మందికి పైగా రీసెర్చ్ లో పాల్గొనడం జరిగింది.
చేసిన ఈ స్టడీలో తెలిసిందేమిటంటే సాఫ్ట్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, తియ్యగా ఉండే టీలు తీసుకునే వారిలో ఇలాంటి క్యాన్సర్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా పండ్ల రసాలు తీసుకున్న వాళ్ళని అంటే ఆపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష జ్యూస్ మొదలైనవి కూడా గమనించారు. అయితే ఈ రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏమిటంటే..? ఏకంగా వందల మందిలో షుగర్ డ్రింక్స్ వలన ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు.
అయితే కొద్దిగా తీసుకున్న వాళ్ళు కంటే ఎక్కువగా తాగిన వాళ్ళలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలిసింది. రోజుకి ఒకసారి తాగేవాళ్ళ లో 32 శాతం రిస్కు ఉంది. అలానే ఈ షుగర్ డ్రింక్స్ కి బదులుగా కాఫీ లేదా కొవ్వులేని పాలు తీసుకోవడం వల్ల 36 శాతం నుండి 17 శాతానికి రిస్కు తగ్గుతుంది. అయితే షుగర్ స్వీటెన్డ్ డ్రింక్స్ కారణంగా కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుందని ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
అదే విధంగా మెటబాలిక్ సమస్యలు, ఇన్సులిన్ సమస్యలు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఇంఫ్లేమేషన్ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పద్ధతులు పాటిస్తే మంచిది. ప్రతి రోజు మంచి ఆహారం తీసుకోవడం, డైట్ లో ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి రోజు వ్యాయామం కూడా తప్పకుండా చేస్తే మంచిది.
నిద్ర కూడా ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలానే నిద్ర ఒత్తిడిని కూడా తొలగిస్తుంది.కాబట్టి ఎక్కువ సేపు నిద్ర పోవడం, వ్యాయామం చేయడం, మెడిటేషన్ చేయడం లాంటి వాటికి సమయం కేటాయించాలి ఇలా తగినన్ని జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండటం మంచిది. అలానే ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలకు దూరంగా ఉండటం వలన సమస్యలు లేకుండా ఉండొచ్చు.