తెలంగాణ హైకోర్టు డెంగ్యూ నివారణకు చేపట్టిన చర్యలపై విచారణ జరిపగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ప్రభుత్వం తరఫున హైకోర్టులో హాజరు కాగా ప్రభుత్వం తీసుకున్న డెంగ్యూ నివారణ చర్యలపై హైకోర్టు ఆగ్రహం వెల్లడించింది.
ఐఏఎస్ లు కనీసం పత్రికలు కూడా చదవడంలేదని చెప్తూ సామాన్యులకు సమస్యలు వస్తే న్యాయ స్థానం ఊరుకోదని తేల్చి చెప్పేసింది. ఉన్నత అధికారుల జేబుల నుంచి బాధితులకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని పేర్కొంది. అధికారులను డెంగ్యూ నివారణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు కోరినా నివారణపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో డెంగ్యూ పరిస్థితి, ప్రభుత్వంచేపట్టిన చర్యలపై అడ్వొకేట్ జనరల్ నివేదిక సమర్పించగగా ఎంత మందికి డెంగ్యూజ్వరాలు వచ్చాయి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనే వివరాలను కోర్టుకు సమర్పించారు. అయితే.. ప్రభుత్వం తీసుకున్న చర్యలపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నా ఆచరణలో వెనుకగా ఉందని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కావాల్సిన పోస్టర్లు ఇంకా హోర్టింగ్‌లు ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించింది.
రాష్ట్ర ప్రభుత్వం డెంగ్యూ మరణాలను తగ్గించడంలో చొరవ చూపలేదని, సంబంధిత శాఖల ఉన్నతాధికారులని వివరణ ఇచ్చేందుకు గురువారం ఉదయం హాజరు కావాలని హైకోర్టు ఆదేశం జారీ చేసింది.