మున్సిపల్ ఎన్నికలు వచ్చేస్తున్నాయ్..

మున్సిపల్ ఎన్నికలు వచ్చేస్తున్నాయ్..

చట్టబద్ధంగా ఎన్నికల ఏర్పాట్లు జరగడం లేదంటూ వచ్చిన పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేస్తు రానున్న మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పీటీషన్లను కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. గత మూడు నెలల నుండి మున్సిపల్ ఎన్నికలపై చర్చలు జరగగా మంగళవారం హైకోర్టు మున్సిపల్ ఎన్నికలపై తీర్పును ప్రకటించింది.

119 రోజుల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జూన్ 25న జారీ చేసిన విషయం తెల్సిందే. తక్షణమే ఎన్నికలను ప్రారంభించాలని ఎన్నికల సంఘానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్ల ఖరారు, వార్డుల విభజన పైన చొరవ చూపక పోవడం వల్ల హైకోర్టును ఆశ్రయించడం వల్ల ఉన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.