కొమరం భీమ్ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన RRR టీమ్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’ అప్‌డేట్ కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క పోస్టర్ అయినా వదలొచ్చుకదా అని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా మొదలైన తరవాత రామ్ చరణ్ బర్త్ డే అయిపోయింది, ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా వెళ్లిపోయింది. కానీ, సినిమాకు సంబంధించి ఒకే ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమీ అప్‌డేట్ లేదు. అది కూడా ‘RRR’ అధికారిక ప్రెస్ మీట్‌లో విడుదల చేసిన పోస్టరే.

కొమరం భీమ్ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన RRR టీమ్
అయితే, నేడు విప్లవ వీరుడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా RRR టీం ఆయనకి నివాళులర్పిస్తూ ఒక ట్వీట్ చేసింది. కానీ, దీనిలోనూ సినిమాకు సంబంధించి ఏం అప్‌డేట్ లేదు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. తారక్‌ను యంగ్ భీమ్‌గా తెరపై ప్రేక్షకులకు చూపించడానికి తాము చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నామని మాత్రమే ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో, ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు.

‘ఏదో ఒక అప్‌డేట్ ఇవ్వండి.. కనీసం ఒక పోస్టర్ అయినా వదలండి.. ప్లీజ్’ అంటూ ఈ ఇద్దరి స్టార్ హీరోల ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత మంది అయితే తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా, రాజమౌళి కదా.. ఆయన స్ట్రేటజీ ఆయనకి ఉంటుంది. ఎంత మంది ఎన్ని కామెంట్లు చేసినా.. ఎంత విమర్శించినా ఆయన అనుకున్నప్పుడే పోస్టరయినా.. ఏదైనా అప్‌డేట్ అయినా. అంత వరకు వేచి చూడక తప్పదు. కానీ, చివరిగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే విధంగానే రాజమౌళి ఇచ్చే అప్‌డేట్ ఉంటుంది. అందులో నో డౌట్.