నోబెల్ పురస్కార విజేతతో మోదీ

నోబెల్ విజేతతో మోదీ

ఆర్థిక వేత్త, నోబెల్ పురస్కార విజేత అభిజిత్ బెనర్జీని ప్రధాని మోదీ ఢిల్లీలో కలిసిన నేపథ్యం లో బెనర్జీపై మోదీ ప్రశంసలు కురిపిస్తూ దేశం గర్వీస్తుందని తెలిపారు.భవిష్యత్తులో అభిజిత్ బెనర్జీ చేయబోయే పనులు నెరవేరాలని,వివిధ అంశాల గురించి చర్చించామని ట్విట్టర్ ద్వారా మోదీ తెలియ చేశారు.

ప్రధానితో భేటీ తర్వాత బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తనకు సమయం కేటాయించడం ఆనందంగా ఉందని చెప్పారు. దేశం పట్ల ప్రధాని మోదీ తన ఆలోచన విధానాన్ని, తన పాలన గురించి తెలిపారని బెనర్జీ వెల్లడించి మరింత బాధ్యతగా ఉద్యోగ వ్యవస్థ ఉండటం ప్రధాని ప్రయత్నిస్తున్నారని బెనర్జీ తెలిపారు.

ఆర్థిక శాస్త్రంలో పేదరిక నిర్మూలన కోసం చేసిన కృషికి బెనర్జీ కి నోబెల్ బహుమతి అందింది. బెనర్జీ జన్మస్థ లం భారత్‌. మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బెనర్జీ ఎకనమిక్స్‌ లో గ్రాడ్యుయేషన్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి తిస్కున్నారు.