హైకోర్టులో అశోక్‌బాబుకు చుక్కెదురు

High Court verdict on AP NGO President Ashok Kumar Petition

ఆంధ్రప్రదేశ్‌ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. అడ్‌హాక్‌ కమిటీని రద్దు చేయాలని కోరుతూ అశోక్‌బాబు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. ఆయన వేసిన పిటిషన్ పై ఈ నెల 13న వాదనలు విన్న సింగిల్ బెంచ్ స్టే విధించింది. పిటిషన్‌పై స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ గౌడ్‌ డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ వేశారు. దీన్ని విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్… స్టేను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. జనరల్‌ బాడీ మీటింగ్‌ను ఎందుకు నిర్వహించలేదని, సంవత్సరాంతర రిటర్న్స్‌ను ఎందుకు ఇంకా సమర్పించలేదని అశోక్‌బాబును హైకోర్టు ప్రశ్నించింది. నిబంధన ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డీసీవోను ఆదేశించింది. హౌసింగ్ సొసైటీకి మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.