బీటెక్ రవి దీక్ష భగ్నం…ఉద్రిక్త పరిస్థితులు !

police interrupted hunger strike of Btech Ravi and btech ravi

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం గత ఎనిమిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షను పోలీసులు భగ్నం చేయడానికి పోలీసుల ప్రయత్నాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. ముఖ్యంగా బీటెక్ రవికి అత్యవసరంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుపడడంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీటెక్ రవికి అత్యవసరంగా వైద్య చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్న నేపథ్యంలో దీక్షా శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో వైద్యులు చేరుకున్నారు. అలాగే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు బీటెక్ రవి దీక్షను భగ్నం చేసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.