AP Politics: నన్ను చంపడానికి జగన్ కుట్ర: బీటెక్ రవి

AP Politics: Jagan's conspiracy to kill me: BTech Ravi
AP Politics: Jagan's conspiracy to kill me: BTech Ravi

తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని పులివెందుల తెదేపా ఇన్ఛార్జి బీటెక్ రవి ఆరోపించారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని చెప్పారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. ‘‘నాకున్న ఇద్దరు గన్మెన్లు ఉదయం వెనక్కి వెళ్లిపోయారు. గన్మెన్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తా. జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నాకు తెదేపా అవకాశం కల్పించాలి. నాకు ఏదైనా జరిగితే బాధ్యత జగన్దే’’ అని బీటెక్ రవి అన్నారు.