హైటెక్ దోపిడీ…కరోనా కేటుగాళ్ల

ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అల్లల్లాడిపోతుంది. ఇదే కరోనా వైరస్ అంశాన్ని కొంతమంది క్యాష్ చేసుకొని నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్ అని చెప్పి భారీ మోసానికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. కరోనా క్లియరెన్స్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత మీకు పార్శిల్ పంపిస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు జమ చేసిన కేటుగాళ్ల ఘరానా దోపిడీ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చివరకు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం పొక్కింది.కాగా కరోనాపై ప్రజలకు ఉన్న అవగాహన లేమిని ఆసరాగా చేసుకొన్న కొందరు కేటుగాళ్లు హైటెక్ దోపిడీకి పాల్పడ్డారు. ఆన్‌లైన్ వేదికగా ఘరానా మోసాలకు తెగబడ్డారు. ఇలా ఏకంగా ఓ పోలీస్‌కే ఫోన్ చేసి కరోనా క్లియరెన్స్ పేరు చెప్పి లక్షలకు లక్షలు దోచేసిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. మొత్తానికి బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.