ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గత 121 ఏళ్లలో రెండో అత్యధిక వర్షంపాతం మే నెలలో నమోదైనట్లు భారత వాతావరణ శాఖ గురువారం తన నివేదికలో తెలిపింది. మేలో కురిసిన రికార్డు వర్షపాతానికి.. క్రితం సంభవించిన టౌటే, యాస్ తుపానుల ప్రభావము, పాశ్చాత్య అవాంతరాలు కారణమని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక దేశవ్యాప్తంగా 2021 మేలో 107.9 మి.మీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. ఇది సాధారణం నమోదయ్యే వర్షపాతం కన్నా 74 శాతం ఎక్కువని తెలిపింది. 1901 మేలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత తర్వాత, 1917 లో 32.68 డిగ్రీల సెల్సియస్, తర్వాత 1977లో 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రస్తుతం నాలుగోసారి అత్యల్పంగా ఈ మేలో 34.18 డిగ్రీల నమోదైనట్లు ఐఎండీ తెలిపింది.