Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిమాచల్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జైరామ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శాసనసభాపక్ష నేతగా ఠాకూర్ ను ఎన్నుకున్నట్టు పార్టీ కేంద్ర పరిశీలకులు నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించగా..పార్టీ సీఎం అభ్యర్థి ధుమాల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో కొత్త సీఎం ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా పేరు ప్రముఖంగా వినిపించింది కానీ చివరికి శాసనసభా పక్ష సమావేశంలో జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. సమావేశానికి పార్టీ పరిశీలకులుగా కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్ హాజరయ్యరు. 52 ఏళ్ల ఠాకూర్ గతంలో మంత్రిగా పనిచేశారు.