హాలీవుడ్ ప్రొడ్యూసర్ కి కరోనా

ప్రపంచాన్ని గడగడలాడించేస్తుంది కరోనా వైరస్. చైనాలో పుట్టి అన్ని దేశాలకు పాకింది. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. కరోనా వైరస్ ఎవ్వరనీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు వైరస్… అవకాశం దొరికితే చాలు అంతే అర్లుకుపోతుంది. హాలీవుడ్ నటుడు టామ్ హార్వేకు ఇప్పటికే కరోనా పాజిటివ్ అని స్పష్టమైంది. హాలీవుడ్ నటికి కూడా కరోనా సోకింది. ఇలా హాలీవుడ్ కి అందులోనూ సెలెబ్రెటీలకు కరోనా వైరస్ సోకడంపై ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా హాలీవుడ్ నిర్మాత విలియం హార్వేకు కరోనా వైరస్ సోకింది. గతంలో ఈ నిర్మాత మీటు ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ మీటు కారణంగా ప్రస్తుతం ఆయన జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులో ఉన్న విలియం హార్వేకు ఈ మధ్య టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ప్రత్యేకంగా నిర్బంధంలో ఉంచినట్టు జైలు అధికారులు వెల్లడించారు. జైలులో ఉన్న విలియం హార్వేకు కరోనా వైరస్ సోకడంతో ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. మిగతా ఖైదీలు ఎవరికీ కూడా వైరస్ సోకలేదని, హార్వేను నిర్బంధంలో ఉంచామని అధికారులు వెల్లడిస్తున్నారు.