ప్రజలకు ప్రత్యేక పాకేజీలు అందజేయాలి:చంద్రబాబు డిమాండ్

కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో పరిస్థితులు చాలా కష్ట తరంగా మారాయని అన్నారు ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి దారుణమైన పరిస్థితులన్నీ పరిశీలించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉదారంగా ముందుకు రావాలని.. ఆవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు పోవాలని స్పష్టం చేశారు. అలాగే..  పేదవాళ్లకు ఉపాధి కల్పించడం వంటి చర్యలను చేపట్టాలని బాబు వెల్లడించారు. నలుగురి కంటే ఎక్కువ ఉండకూడదని, నలుగురు ఉన్న చోట ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడే పరిస్థితి లేకుండా ఉండాలని చంద్రబాబు ప్రజలకు తెలియజేశారు.

అదేవిధంగా ఈ మధ్య కేరళ 20,000 కోట్ల రూపాయలతో కరోనా కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని.. అలాగే.. తెలంగాణాలో కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చి పెన్షన్ కూడా ఇచ్చారని, అలా ప్రతి చోటా ఆయా ప్రభుత్వాలు  తమదైన బాధ్యతను నిర్వర్తించాలని ఆయన కోరారు. తమ పరిపాలనా కాలంలో హుద్ హుద్ వంటి భయంకరమైన తుఫాను సంభవించినప్పుడు నిత్య అవసర వస్తువులను అందించటమే కాకుండా.. ముడి సరుకులు కొనుగోలుకు ప్రతి కుటుంబానికి నాలుగు వేల రూపాయిలు ఇచ్చినట్లు బాబు వెల్లడించారు.అంతేకాకుండా ప్రతి చోటా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ప్రజలకు అండగా నిలవాలని.. ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్ధిక పరిస్థితులు దెబ్బతినే ప్రమాదం ఉందని.. వ్యవసాయం, ఇతర పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. ఇలాంటి దారుణమైన పరిస్థితులో ప్రజలను ఒక ఒడ్డుకు చేర్చాలని.. ఇళ్ళ నుండి బయటకు రానివ్వకుండా జనసంచారాన్ని అరికట్టాలని… ఇంటింటికీ నిత్య అవసర వస్తువులను పంపాలని చంద్రబాబు వివరించారు. విదేశాల నుంచి వచ్చే వారిని ముందుగానే క్వారంటైన్ లో ఉంచాలని, శానిటైజర్లు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. డిజిటల్ వర్క్స్ చేసుకోగలిగితే ప్రస్తుతం భయంకరమైన సమస్య నుంచి కొంతమేరకు బయట పడతామని బాబు స్పష్టం చేశారు. అలాగే.. ప్రతి ఒక్కరూ ఇళ్ళకే పరిమితం కావాలనీ.. ఇలాంటి చర్యలతోనే ఈ మహమ్మారిని అరికట్టవచ్చునని చంద్రబాబు నాయుడు వివరించారు.