వివాహేతర సంబంధాలు అనేక రకాలుగా మనుషుల అంతం కోరుతున్నాయి. గత కొద్ది నెలలుగా మీడియాలో వివాహేతర సంబంధం ఒక్కటయినా ఉంటుందంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా వివాహేతర బంధం కారణంగా ఒక సామాన్యుడి చేతిలో రాజకీయ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. సంభాల్ ప్రాంతం నాయి బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్న జగ్‌దీష్ మాలి (33) రాజకీయ నాయకుడు.
గతంలో ఓ పార్టీ తరపున అభ్యర్ధిగా పోటీ కూడా చేశారు. అతని భార్య దిలీప్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో ఆమెను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయితే అతని మాటను లెక్కచేయని భార్య సంబంధం కొనసాగించేది. ఈ క్రమంలో శుక్రవారం జగ్‌దీష్ మాలి ఇంట్లో లేని సమయంలో దిలీప్ అతని ఇంటికి వచ్చాడు. అనుకోకుండా అదే సమయంలో ఇంటికి వచ్చిన మాలి తన భార్య, దిలీప్‌తో ఉండటం చూసి అతనితో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో దిలీప్ తన దగ్గర ఉన్న నాటు తుపాకితో మాలి మీద కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మాలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.