గంజాయిపై ఉక్కు పాదం… హోంమంత్రి అనిత

హోంమంత్రి వంగలపూడి అనిత
హోంమంత్రి వంగలపూడి అనిత

ఏపీ శాసమండలిలో మాదక ద్రవ్యాల వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని మొట్టమొదటి టార్గెట్‌గా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గంజాయి నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వంలో సీఎం ఇంటి దగ్గరే గంజాయి తాగి అత్యాచారం చేస్తే కనీసం నిందితులను గుర్తించే పరిస్థితి లేకుండా ఉన్నాయని మండిపడ్డారు.