పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి సీరియస్

హోంమంత్రి వంగలపూడి అనిత
హోంమంత్రి వంగలపూడి అనిత

ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు తిరుణాలలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. ఈ దాడి ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు హోంమంత్రి ఆదేశించారు.