చేతులకు కూడా తగినంత కేర్ అవసరం. అయితే, అందుకోసం.. ఈ రెమెడీని ట్రై చేసిన వారికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ కనిపించాయట. చేతులు మరియు కాళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు. కాళ్ళు, చేతులు అందంగా కనబడుటకోసం క్రీమ్స్ మరియు ఆయిట్ మెంట్స్ మాత్రమే కాకుండా కొన్ని హోం రెమెడీస్‌ను ఉపయోగించుకోవచ్చు.తేనెను కీరదోసకాయతో మిక్స్ చేసి పేస్ట్‌లా చేసి కాళ్ళకు మరియు చేతులకు అప్లై చేయాలి. ఇది స్కిన్ కాంప్లెక్షన్ను మెరుగుపరుస్తుంది.
ఇందులో శక్తివంతమైన మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీన్ని చేతులకు తరచూ అప్లై చేసుకుంటే చేతులు సాఫ్ట్‌గా మారతాయి. చేతులకు సన్నటి లేయర్‌గా పెట్రోలియం జెల్లీను అప్లై చేసుకుని హ్యాండ్ గ్లోవ్స్‌ను వేసుకోవాలి. నిద్రపోయే ముందు ఈ ప్రాసెస్‌ను పాటిస్తే రిజల్ట్స్ బాగుంటాయి. ప్రతి రోజూ రాత్రి ఈ ప్రాసెస్‌ను ఫాలో అవవచ్చు.
స్కిన్‌ను మాయిశ్చరైజ్ చేసి స్కిన్ హెల్త్‌ను ఇంప్రూవ్ చేస్తుందిది. కాబట్టి డ్రై స్కిన్ ప్రాబ్లమ్‌ను ఈజీగా అరికట్టవచ్చు. ఓట్ మీల్ రెమెడీతో చేతులు సూపర్ సాఫ్ట్‌గా మారతాయి. 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌లో అర టేబుల్ స్పూన్ కొబ్బరినూనెను కలపండి. ఈ రెండిటినీ బాగా కలిపి చేతులకు అప్లై చేయండి. పదినుంచి పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చేతులను వాష్ చేసుకోండి. ఓట్ మీల్‌తో తయారైన మాయిశ్చరైజర్స్‌ను వాడండి.
ఎగ్ యోల్క్లో స్కిన్ కండిషన్‌ను మెరుగుపరిచే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎగ్ యోల్క్ను బాగా విస్క్ చేసి హాండ్స్పై అప్లై చేయండి. పదిహేను నుంచి 20 నిమిషాలపాటు చేతులపై ఈ మిశ్రమాన్ని ఉంచండి. ఆ తరువాత మైల్డ్ సోప్ వాటర్‌తో చేతులను వాష్ చేసుకోండి. అప్పుడు ఎగ్ ఆడర్ తొలగిపోతుంది. వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఈ ప్రాసెస్‌ను ఫాలో అవ్వండి.
కోకనట్ వాటర్‌ను మీ చేతులు మరియు కాళ్ళు అందంగా కనబడాలంటే కోకనట్ వాటర్ ను అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.నిమ్మరసానికి కొద్దిగా కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి, మీ చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేయాలి . ఇది చర్మాన్ని ఫెయిర్‌గా మార్చుతుంది.పెరుగును మీ చేతులకు మరియు కాళ్ళకు అప్లై చేయడ వల్ల చేతులు సాఫ్ట్‌గా తయారవుతాయి. ఇందులో జింక్ మరియు లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల స్కిన్ టోన్‌ను లైటెన్ చేస్తుంది.
చర్మాన్ని సూత్ చేయడానికి అలాగే మాయిశ్చర్ చేయడానికి తేనె హెల్ప్ చేస్తుంది. పచ్చి తేనె ఎంతో బాగా పనిచేస్తుంది. చేతులలోకి పచ్చి తేనెను తీసుకోండి. రెండు చేతులకూ బాగా అప్లై చేయండి. పదిహేను నుంచి ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఆ తరువాత రిన్స్ చేయండి. ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేయండి.
అలోవెరాలో స్కిన్ ను మాయిశ్చరైజ్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలోవెరాను స్కిన్ కేర్‌లో భాగంగా ఉపయోగించడం ముఖ్యం. అలో లీఫ్ నుంచి జెల్‌ను సేకరించండి. ఈ జెల్‌ను చేతులపై అప్లై చేయండి. పదిహేను నుంచి ఇరవై నిమిషాలపాటు చేతులపై ఉన్న జెల్ అలాగే ఉంచండి. ఆ తరువాత రిన్స్ చేసుకోండి. మిగతా జెల్ ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే తరువాతి యూజ్‌కు హెల్పవుతుంది.
కొబ్బరినూనె అనేది స్కిన్ హైడ్రేషన్‌ను పెంపొందించడంలో మెయిన్ రోల్ పోషిస్తుంది. స్కిన్ లో మాయిశ్చర్ లోటు ఏర్పడదు. కొబ్బరినూనెను చేతులపై అప్లై చేసుకోవాలి. ఆ తరువాత గ్లోవ్స్‌ను వేసుకోవాలి. రెండుగంటల తరువాత గ్లోవ్స్ తీసేయవచ్చు. రాత్రంతా ఉంచితే మరీ మంచిది. ఈ నూనెలో ఉన్న స్కిన్ కేర్ ప్రాపర్టీస్‌ను స్కిన్ గ్రహించగలుగుతుంది.