Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరాబాబా…ఆయన దత్తపుత్రిక గా చెప్పుకునే హనీప్రీత్ పై సినిమా తీస్తున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హనీప్రీత్ కు తనపై అనుమానమని, గుర్మీత్ ను తాను కలుస్తానంటే హనీప్రీత్ ఒప్పుకునేది కాదని, తాను గుర్మీత్ ను పెళ్లిచేసుకుంటానేమో అని ఆమె భయపడుతుండేదని రాఖీ సావంత్ తెలిపింది. ఎ డైలాగ్ విత్ జేసీ అనే చాట్ షోలో రాఖీ సావంత్ ఈ వ్యాఖ్యలు చేసింది.
తనకు మూడేళ్లుగా గుర్మీత్, హనీప్రీత్ తో పరిచయముందని, చాలాసార్లు వాళ్లను కలిసానని తెలిపింది. ఓసారి తన పుట్టినరోజు సందర్భంగా డేరా బాబా తనను ఆశ్రమానికి ఆహ్వానించాడని, కానీ అది హనీప్రీత్ కు నచ్చేది కాదని చెప్పుకొచ్చింది. డేరా ఆశ్రమంలో ఏదో జరుగుతోందని మాత్రమే తనకు అనుమానముండేదని, అయితే, బాబా ఇంత క్రూరుడని మాత్రం తనకు అస్సలు తెలియదని రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. డేరాబాబా పై వస్తున్న సినిమాలో రాఖీ సావంత్ హనీప్రీత్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.