ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మహోబాకు చెందిన యువతి (30)ని ఓ వ్యక్తి లైంగికంగా వేధించి, కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడి తల్లిదండ్రులు ఆ యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. పోలీసులు వివరాల ప్రకారం.. యూపీలోని మహోబాకు చెందిన ఓ యువతిని పొరుగువారు కొట్టి వేధించారు. దీనిపై ఆమె కుల్‌పహార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కేసు నమోదు చేసినందుకు కోపంతో నిందితుడి తల్లిదండ్రులు యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఆ యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఝాన్సీ ఆస్పత్రికి తలించారు. ఈ ఘటనపై నిందితుడి తల్లిని అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కుల్‌పహార్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు.