అనకాపల్లిలో పట్టపగలే భయంకరమైన చోరీ జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు, అధికారులు అప్రమత్తమయ్యారు. పింఛన్ సొమ్ము పంపిణీకి భారీగా నగదును తరలిస్తూ నక్కపల్లి నుంచి రాజయ్యపేటకు స్కూటర్‌పై వెళ్తున్న సంక్షేమ సహాయకుడు, డిజిటల్ అసిస్టెంట్‌పై ఇద్దరు దుండగులు దాడి చేశారు.
హెటెరో రోడ్డులో ఈ సంఘటన జరిగింది. దుండగులు పెప్పర్ స్ప్రేని ఉపయోగించి 13 లక్షల నగదుతో పరారయ్యారు. బాధితులు సమీపంలోని బ్యాంకు నుండి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని అర్హులైన వ్యక్తులకు పింఛను పంపిణీ చేయడానికి వెళ్తున్న సమయంలో, మార్గమద్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంఘటనతో భయాందోళనకు గురైనప్పటికీ, బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై అనకాపల్లి పోలీసు అధికారులు వెంటనే నివేదిక నమోదు చేసి విస్తృత దర్యాప్తు చేపట్టారు.