సుష్మితా సేన్ నటించిన తన తాజా సిరీస్ ఆర్యను విడుదల చేసిన హాట్‌స్టార్ స్పెషల్స్

నేరం, కుటుంబం మరియు మనుగడకు సంబంధించిన శక్తివంతమైన కథ

ఆర్‌ఎంఎఫ్ (రామ్ మాధ్వాని ఫిలింస్) భాగస్వామ్యంతో హాట్‌స్టార్ స్పెషల్స్ వ్యవస్థీకృత నేరాలు రోజువారీ కుటుంబ వ్యాపారంగా మరియు తీవ్రమైన ద్రోహాన్ని ఒంటబట్టించుకున్న కథ-ఆర్యను ప్రసారం చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంది. హాట్‌స్టార్ స్పెషల్స్‌లో ప్రసారం కానున్న ఆర్య ప్రేమించే భార్య మరియు చిటపటలాడే తల్లి (ఆర్య) పాత్రలతో ప్రారంభం అవుతుండగా, ఇష్టం లేకపోయినా ఆమె అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే కుటుంబానికి చేరువ కావలసి రావడంతో; అకస్మాత్తుగా ఆమె జీవితం తలకిందులవుతుంది మరియు ఆమె కుటుంబ బెదిరింపులకు గురికావడంతో తన కుటుంబ సభ్యులకు రక్షించుకునేందుకు ఆమె పడే ఇబ్బందులకు ఇది అద్దం పడుతుంది. తన కుటుంబాన్ని నేరగాళ్ల నుంచి తప్పించేందుకు తాను కూడా వారిలానే మారాలని ఆమె అర్థం చేసుకుంటుంది!

మాజీ మిస్ యూనివర్స్ మరియు నటి సుష్మితా సేన్ కథానాయికగా తన డిజిటల్ అరంగ్రేటాన్ని ఈ షోతో ప్రారంభించగా, దాదాపు ఒక దశాబ్దం అనంతరం ఆమె నటించేందుకు కెమెరా ముందుకు వచ్చారు. ప్రజాదరణ పొందిన నటుడు చంద్రచూర్ సింగ్ కూడా ఈ విలక్షణ కథలో తెర పైకి కనిపించేందుకు ముందుకు వచ్చారు. ఈ షోలో ప్రతిభావంతులైన నటులు నమిత్ దాస్సికందర్ ఖేర్జయంత్ కృపాలానిసొహైలా కపూర్సుగంధా గార్గ్మాయా సరీన్విశ్వజిత్ ప్రధాన్ మరియు మనీష్ చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఎండెమోల్ షైన్ సహ- నిర్మాతగా వ్యవహరించిన ఆర్య షోను ప్రసిద్ధ డచ్ క్రైమ్-డ్రామా పెనోజాకు అధికారిక అనుకరణ.

దర్శకులు రామ్ మాధ్వాని, సందీప్ మోడీ మరియు వినోద్ రావత్‌లు పూర్తి సిరీస్‌ను 360 డిగ్రీల వ్యవస్థతో, సహజమైన వెలుగులో చిత్రీకరించడంతో, ఇది షోకు నిజమైన, విశ్వసనీయ రూపాన్ని అందించగా- డిజిటల్ కంటెంట్‌కు ఈ తరహా విధానం మొట్టమొదటిదని గంటాపథంగా చెప్పవచ్చు. రచయితలు సందీప్ శ్రీవాస్తవ్ మరియు అను సింగ్ చౌదరి కుటుంబ సంబంధాల్లోని విబేధాలకు, ద్రోహం మరియు మోసం సుడిలో చిక్కుకున్న కథాంశానికి ప్రత్యేకత కల్పించారు. రాజస్థాన్‌లో చక్కని ప్రాంతాల్లో చిత్రీకరించిన ఆర్య సమకాలీన భారతదేశంలో శక్తివంతమైన మహిళల పాత్రను స్ఫూర్తిగా తీసుకుంది. హాట్‌స్టార్ స్పెషల్స్ సమర్పిస్తున్న ఆర్య జూన్ 19 2020న డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే విడుదల కానుంది.

సహ-సృష్టికర్త, ఆర్‌ఎంఎఫ్ (రామ్ మాధ్వానీ ఫిలింస్)కు సహ-నిర్మాత రామ్ మాధ్వానీ మాట్లాడుతూ, ‘‘ఆర్యకు సంబంధించిన ప్రపంచం భావోద్వేగాలు, వక్రీకరించిన కుటుంబ బంధాలు, ద్రోహం, వంచనలను గుండెల నిండా నింపుకున్న సంక్లిష్టమైన సాలెగూడుగా ఉంటుంది. ఇది ధైర్యంతో కూడుకున్న బలమైన కథనం, నేరం- నాటకీయతలను పరిధిని దాటి ముందుకు తోడ్కొని వెళుతుంది. ప్రతి పాత్రకు ఆర్య ప్రయాణంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక సాధారణ గృహిణి నుంచి ఒక కఠినమైన నేరస్థురాలిగా మారే ప్రక్రియ అత్యంత ఆసక్తిగా, పలు మలుపులను కలిగి ఉంటుంది. నేను ఈ ప్రపంచాన్ని ఇటుకపై ఇటుక ఉంచి నిర్మించేందుకు నేను చాలా ఏళ్లు గడిపినా, ఏదీ ఒంటరిగా చేయలేదు- తారాగణం మరియు సిబ్బందితో పాటు 588 మంది ఈ షోకు పునాదుల నుంచి చివరి వరకు భుజం కలిపి తోడుగా నిలిచారు!  ద్వారా ఇటుకతో నిర్మించటానికి చాలా సంవత్సరాలు గడిపానుకానీ నేను ఒంటరిగా చేయలేదు – తారాగణం మరియు సిబ్బంది నుంచి 588 మంది ఇతరులు ఈ ప్రదర్శనను గ్రౌండ్ అప్ నుండి నిర్మించారు! ఆర్యను ఈ స్థాయిలో రూపొందించేందుకు మాకు పూర్తి సహకారాన్ని అందించిన హాట్‌స్టార్ స్పెషల్స్ బృందానికి; అత్యంత ప్రతిభ  ఉన్న సుష్మితా సేన్, చంద్రచూర్ సింగ్ మరియు మా నటులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ అనూహ్యమైన, తాజా వీక్షణ అనుభవాన్ని అందిస్తుందని!’’ పేర్కొన్నారు.

కథానాయకి సుష్మితా సేన్ మాట్లాడుతూ, ‘‘ ఆర్య బలం, సంకల్పం మరియు అన్నింటికన్నా నేరాలతో నిండి ఉన్న ప్రపంచంలో, పురుషుల ప్రాధాన్యత ఉన్న ప్రపంచంలో ప్రాతినిధ్యం వహిస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఇది కుటుంబం, ద్రోహం, తన పిల్లలను రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే తల్లి పాత్ర చాలా నచ్చింది. నన్ను మెప్పించే పాత్రను అందుకునేందుకు నాకు ఒక దశాబ్ద సమయం పట్టింది మరియు ఈ అద్భుతమైన కథలో ఒక భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితకాలంలో అరుదుగా లభించే ఒక పాత్రను నాకు ఇచ్చినందుకు హాట్‌స్టార్ స్పెషల్స్, రామ్ మాధ్వానీ మరియు వారి బృందానికి నాకు జీవితకాలం పాత్రను ఇచ్చినందుకు హాట్స్టార్ స్పెషల్స్రామ్ మాధ్వానీ మరియు అతని బృందానికి ధన్యవాదాలని!’’ ఆమె తెలిపారు.

చంద్రచూర్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఆర్యలో అబద్ధాలు, ద్రోహం సాలెగూడులా చాలా విషయాలు-సీతాకోకచిలుక ప్రభావంలా వెనువెంటనే మారిపోతూ ఉంటాయి. డిజిటల్ కంటెంట్‌లలో అందరినీ ఆకట్టుకునే విషయం ఏమంటే కథలో ధైర్యమైన రూపం ఉంటుంది. ఈ షో ద్వారా డిజిటల్ తెరపై నేను అరంగ్రేటం చేయడం నాయకు సంతోషంగా ఉంది. ఇది పలు మలుపులతో, ఉత్కంఠతతో, ఉద్రిక్తత, తీవ్రతలతో చివరి వరకు ప్రేక్షకులను ఆసక్తిగా వీక్షించేలా చేస్తుందని’’ పేర్కొన్నారు.

సంక్షిప్తముగా షో గురించి

రాజస్థాన్‌లో ఉన్నత తరగతి కుటుంబంలో జన్మించిన ఆర్య (సుష్మితా సేన్), తేజ్ (చంద్రచూర్ సింగ్)కు విధేయురాలైన కుమార్తె, ప్రేమను పంచే సోదరి, ముగ్గరు అందమైన పిల్లలకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న తల్లి. ఆమె కుటుంబానికి అతి పెద్ద ఔషధ తయారీ సంస్థను కలిగి ఉండగా, ఇది ఇది తేజ్జవహర్ మరియు ఆమె సోదరుడు- సంగ్రామ్ నడుపుతున్న అక్రమ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఉంటుంది. తన భర్త కుటుంబ వ్యాపారంలో చాలా లోతుగా చిక్కుకున్నట్లు గుర్తించినప్పుడుఆమె అతనికి వ్యాపారాన్ని విడిచిపెట్టేందుకు లేదా ఆమెను మరియు పిల్లలను విడిచిపెట్టాలని అల్టిమేటం ఇస్తుంది. అకస్మాత్తుగా, తేజ్‌పై దాడి జరుగుతుంది, ఆమె కుటుంబానికి ప్రాణహాని సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితులు ఆర్య జీవితాన్ని పూర్తిగా మార్చి వేస్తుంది. ఆమె ఇప్పుడు తన కుటుంబాన్ని ప్రత్యర్థుల నుండి రక్షించుకోవాలన్న తపనతో, తన కుటుంబం మరియు వ్యాపారాలకు సంబంధించిన చీకటి రహస్యాలను తెలుసుకుంటుంది. అదే సమయంలో తాను విడిచి పెట్టాలనుకునే ప్రపచమే ఆమెను లోతుగా లాక్కొంటూ ఉంటుంది.

ఈ షోకు సంబంధించిన ట్రైలర్‌ను ఇక్కడ వీక్షించండి:

 

తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు ఆర్య ఎంత దూరం వెళుతుంది? హాట్‌స్టార్ స్పెషల్స్‌ సమర్పిస్తున్న ఆర్య జూన్ 19, 2020 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం అవుతుంది.