ప్రస్తుత జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ డిప్రెషన్‌కు గురౌతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు భిన్న కొత్త అలవాట్లకు బానిసవుతున్నారు. ఫలితంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టవుతుంది పరిస్థితి. ముఖ్యంగా ఆ టైంలో ఈ నాలుగింటికి మాత్రం చాలా దూరంగా ఉండాలి.
కొంతమంది అధిక ఒత్తిడిని తట్టుకోవడానికి వైన్, బీర్, రైస్ వైన్ లాంటి ఆల్కహాల్‌కు అడిక్ట్ అవుతారు. ఇలా చేయడం వల్ల సమస్య మరింత జఠిలమౌతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలోని కారకాలు ఒత్తిడిని మరింత పెంచుతాయట.
డిప్రెషన్‌కు గురైనవారు సిగరేట్స్ కూడా అధికంగా కాల్చుతారు. ఈ సమయంలో ధూమపానం మాత్రమేకాదు, పొగాకు తాలూకు వేటిని కూడా తీసుకోకపోవడం మంచిది,మరికొంత మంది ఒత్తిడిలో అధికంగా ఫుడ్ తినేస్తుంటారు. అందులో ప్రాసెస్డ్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్, కూల్‌డ్రింక్స్.. వంటివి కూడా ఆరోగ్యానికి మరింత హాని కలుగజేస్తాయి.
కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలకు కూడా సాధ్యమైనంత దూరంగా ఉండాలి. సాధారణంగా కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, ఇతర సప్లిమెంట్లలో కెఫీన్ అధికంగా ఉంటుంది. వీటిని సేవిస్తే రాత్రుల్లు నిద్రపట్టక డిప్రెషన్ తాలూకు ఆలోచనలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రతి ఉదయం 5 గంటలకు నిద్రలేచి ధ్యానం చేయడం, చిన్న పాటి యోగాసనాలు వేయటం, బుక్స్ చదవడం, చిన్న పిల్లలతో ఎక్కువ సమయం గడపటం, డ్రాయింగ్, పెయింటింగ్ లేదా కొత్ర ప్రదేశాలకు వెళ్లటం.. వంటి పనుల ద్వారా మనసును వేరే వాటిపైకి మళ్లించి జీవితాన్ని మరింత ఆనందంగా గడపాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.