పవన్ రెండు లక్షల పుస్తకాలు ఎలా చదివాడు అబ్బా ?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగు దేశం తో విభేదించి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కావాలనే బీజేపీతో చేతులు కలిపి తెలుగుదేశం మీద బురద చల్లుతున్నారు అనేది తెలుగు దేశం శ్రేణుల ఆరోపణ. అందుకే శ్రీ రెడ్డి క్లియర్ గా వైసీపీ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పినా తెలుగుదేశం మీద ఆ మారక రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు పవన్. అయితే తెలుగుదేశంతో మైత్రి చెడిపోవడంతో జగన్ తిట్ల దగ్గరనుండి ఎన్నో అంశాల వరకు తమ మిత్రుడిగా భావించిన పవన్ ని భుజాన మోసిన తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు పవన్ తప్పులని వేలెత్తి చూపించే పనిలో పడ్డారు. అలా తెలుగుదేశం కార్యకర్తలు వెలికితీసిన ఓ అంశం ఇప్పుడు పవన్ విషయంలో నవ్వులు పూయిస్తోంది.

అదేమిటంటే పవన్ కి పుస్తకాల పిచ్చి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే కదా అయితే పవన్ కళ్యాన్ పుస్తకాల గురించి ఓ ఆసక్తికర కథనం బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్‌ను పిచ్చిగా అభిమానించే ఓ అభిమాని పవన్ జీవిత చరిత్రను తానే స్వయంగా రాయాలనుకుని గత కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్ జీవితంపై రీసెర్చ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ తండ్రి వెంకట్రావ్, తల్లి అంజనా దేవి, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబుతో సమావేశమై ఆయన గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తండ్రి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల పుస్తకాల చదివినట్లు వెల్లడించారట. పవన్ కళ్యాణ్… రమణ మహర్షిని ఫాలో అవుతుంటారని వెల్లడించారట. అసలు పవన్ వయసేమిటి ఆయన చదివిన పుస్తకాలెన్ని అనే లాజిక్ ని నెటిజన్లు తెర మీదకి తెస్తున్నారు. పవన్ వయస్సు 47 ఏళ్ళు, సంవత్సరానికి 365 రొజులు చొప్పున లెక్క వేస్తే 17155 రొజులు అంటే రెండు లక్షల పుస్తకాలు చదవాలి అంటే ఆయన పుట్టిన మొదటి రోజు నుంచి నేటి వరకు ఆయన ప్రతి రోజూ 12 పుస్తకాలు చదవాలి ఇది ఎవరికయినా సాధ్యం అయ్యే పనేనా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.