Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
how surjical strike links with anchor
పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. స్వీయ రక్షణ కోసం భారత్ ఎంతకైనా తెగిస్తుందనే సందేశం ఇచ్చాయి. కానీ సర్జికల్ స్ట్రైక్స్ వెనుక గ్రౌండ్ వర్క్ ఎలా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా అంత సాహసోపేతమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే.. ఉరీ ఉగ్రదాడి అనేది సామాన్యులకు తెలిసిన విషయం. దీని వెనుక కేంద్రం ఇగోను హర్ట్ చేసిన ఓ జర్నలిస్టుకూ పాత్ర ఉందట.
సరిగ్గా సర్జికల్ స్ట్రైక్స్ కు కొన్ని నెలల ముందు మయన్మార్ లోకి వెళ్లి మరీ కొందరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది భారత్ సైన్యం. అందుకు ఆ దేశం కూడా సహకరించింది. అయితే భారత్ గతంలో ఎప్పుడూ పరాయి దేశం భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రదాడి చేయలేదు. దీంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పై ప్రశంసల వర్షం కురిసింది.
అయితే మయన్మార్ లో ఉగ్రదాడి తర్వాత… ఇదే సీన్.. పశ్చిమ సరిహద్దుల్లో రిపీట్ చేస్తారా. మీకా దమ్ముందా ఓ యాంకర్ అడిగిన ప్రశ్న అప్పటి రక్షణ మంత్రి పారికర్ కు సూదిలా తగిలిందట. వెంటనే సర్జికల్ స్ట్రైక్స్ కు కార్యాచరణ మొదలుపెట్టి, పక్కాగా ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. ఈ సంగతి గోవా సీఎంగా ఉన్న పారికర్.. ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సో సర్జికల్ స్ట్రైక్స్ క్రెడితే ఆర్మీతో పాటు సదరు యాంకర్ కూ ఇవ్వాలన్నమాట.