నిరుద్యోగ బృతి పై ఏపీ ప్రభుత్వం సంచలన ప్రకటన…!

How to apply ap nirudyoga bruthi

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతిని అందజేయనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలుకి సిద్దం అయ్యింది. ఇందులో భాగంగా “ముఖ్యమంత్రి యువనేస్తం” వెబ్ సైట్‌ను సెప్టెంబర్ 14న ప్రారంభించాలని యోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాక నిరుద్యోగ భృతి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అప్రెంటీస్‌షిప్‌, ఉద్యోగావకాశాలను పొందేందుకు అర్హుల జాబితాను సైతం సిద్ధం చేసింది.

youvanestham-un-emplyment

ప్రజా సాధికార సర్వేతో పాటు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాల సమాచారం ఆధారంగా ఏపీలో 10,11,234 మంది ఈ నిరుద్యోగ బృతికి అర్హులుగా ఉన్నట్లు తేల్చారు అధికారులు. అలాగే ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల పెన్షన్లు పొందేవారి పిల్లలకు సైతం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సులే కాకుండా డి ఫార్మసీ కోర్సు చదివిన వారిని కూడా నిరుద్యోగ భృతికి అర్హులుగా గుర్తించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సెప్టెంబరు 14 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నమోదు చేసుకున్న అభ్యర్థుల వివరాలను ఈ జాబితాతో పోల్చి చూస్తారు. అలాగే ‘నిరుద్యోగ భృతి’ ఇచ్చేందుకు అప్లై చేసుకోవాల్సిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ సైట్‌ను సెప్టెంబర్ 14న ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ నెల 14వ తేది నుండి http://yuvanestham.ap.gov.in వెబ్ సైటులో నిరుద్యోగులు భృతి కోసం దరఖాస్తులు పంపించుకోవచ్చు.

youvanestham-chandrababu-na
అలాగే ఏపీ ప్రభుత్వం నుండి నిరుద్యోగ భృతి పొందడానికి అర్హతలు :
* దరఖాస్తు చేసేవారు నిరుద్యోగులై మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారై ఉండాలి.
* కనీస డిగ్రీ లేక పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
* 4 చక్రాల వాహనాలు ఉండేవారు అనర్హులు.
* కులాల వారీగా రిజర్వేషన్ కోటా వర్తిస్తుంది.
* దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందినవారు అర్హులు.
* ఒకే కుటుంబంలోని అన్ని అర్హతలు కలిగి ఉన్న వారందరూ ఈ పథకానికి లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోబడతారు
* 22-35 సంవత్సరాల వయస్సులో ఉండాలి.
* అయితే భూమి ఉండి ఆ భూమికి సాగునీటి సౌకర్యం ఉంటే అది 2.5 ఎకరాలు లోపు ఉండాలి.
* నీటి పారుదలలేని భూమి అయితే 5 ఎకరాలు లోపు ఉండాలి.
* అనంతపురం జిల్లాకి చెందినవారైతే సాగునీటి సౌకర్యం ఉన్న భూమి 5 ఎకరాలు లోపు ఉండాలి.
* నీటి పారుదలలేని భూమి అయితే 10 ఎకరాలు లోపు ఉండాలి.
* స్వయం ఉపాధి కోసం రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వాల నుంచి రూ.50,000 మించి ఋణం లేదా లబ్ధి పొందినవారు పథకానికి అర్హులు కారు.
* కనీస విద్యార్హత లేనివారు (రెగ్యులర్ విద్యను అభ్యసిస్తున్నవారు), ప్రభుత్వం/ప్రైవేట్/ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగులు, స్వయం ఉపాధి కలిగిన వారికి అర్హత లేదు.
* ఏ కారణం చేతనైనా ప్రభుత్వ విధుల నుంచి తొలగించబడిన ఉద్యోగులు పథకానికి అర్హులుకారు.
* అభ్యర్ధి ఏదైనా క్రిమినల్ కేసులో దోషిగా నిర్ధారించబడి ఉంటె వారు అర్ధులు కారు.‎
* నిరుద్యోగ భృతి పొందేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నమోదు చేసుకోవడానికి కావలిసిన ముఖ్య ధ్రువపత్రాలు 1) ఆధార్ కార్డు,
2 )రేషన్ కార్డు,
3) ఎస్.ఎస్.సి సర్టిఫికేట్,
4)గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్.