అరవింద సమేత ముగించేశారు!

aravinda sametha

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ టాకీ పార్ట్‌ పూర్తి అయ్యింది. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాన్స్‌ ఉన్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ రెండు పాటలను విదేశాల్లో 10 రోజుల పాటు చిత్రీకరించి పూర్తి చేయబోతున్నారు. ఈనెల 20న చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ట్రైలర్‌ కట్టింగ్‌ కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. సినిమా ఆడియో విడుదల కార్యక్రమం రోజే ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

aravinda sametha

ఆడియో విడుదల కార్యక్రమం పూర్తి అయిన వెంటనే అంటే ఈనెల 20 తర్వాత విదేశాల్లో చిత్రీకరణకు యూనిట్‌ సభ్యులు వెళ్లబోతున్నారు. అక్టోబర్‌ 5 వరకు తిరిగి వచ్చేసి మిగిలి ఉన్న బ్యాలన్స్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేసి, సెన్సార్‌ కార్యక్రమాలు చేయించి సినిమాను ముందు నుండి అనుకుంటున్నట్లుగా దసరాకు విడుదల చేయాలని త్రివిక్రమ్‌ భావిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు తండ్రి పాత్రలో నాగబాబు కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంకు బాలయ్య రాబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతున్న కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి.