ఈ మదర్స్ డే ఇలా సెలబ్రేట్ చేయండి

How to celebrate mother's day

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అమ్మ అనే వ్యక్తి లేకపోతే ఈ ప్రపంచమే లేదు ఎందుకంటే అమ్మ ఉంటేనే జన్మ, జన్మ ఉంటేనే ఈ ప్రపంచం జీవకోటి అంతా. ఇంకొక గమ్మత్తయిన అంశం ఏమిటంటే అమ్మ లేకపోతే ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు. ఇప్పుడిది అంతా ఎందుకంటే ఈ నెల రెండవ ఆదివారం ప్రపంచ మదర్స్ డే, అదేమీ దరిద్రమో రోజు నిద్ర లేస్తూనే అమ్మ కాళ్ళకి దండం  పెట్టుకుని లేచే సంస్కృతి నుండి అమ్మలని ఒక రోజుకి పరిమితం చేసేదాకా వచ్చేశాం. ఇప్పుడు కొత్తగా మదర్స్ డే అదేనండీ మాతృమూర్తి దినోత్సవం జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.

అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే అదీ రెండో ఆదివారం నాడే ఈ ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. అమ్మలకి ఒక ప్రత్యేకమయిన రోజుని కేటాయించి కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు. ఈ సంస్కృతి మనది కాదు పాశ్చాత్యులదే కానీ మన మాతృమూర్తులని గౌరవించేదే కాబట్టి జరుపుకోవడం తప్పులేదు. మా విన్నపం ఏంటంటే అమ్మని ఒక్క రోజుకే పరిమితం చేసి చూడద్దు అనేది. అమ్మంటే ఒక ఎమోషన్ దానిని ఒక పది రూపాయల గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి చేతులు దులుపుకోకండి. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా మీకు సెలవు ఉన్నప్పుడు మీ ఖాళీ సమయాల్లో లేదు కనీసం మీరు జరుపుకుందాం అనుకునే ఈ ఒక్కరోజు అయినా మీ అమ్మని ప్రేమగా పలకరించండి.

కుదిరితే ఆమె వొడిలో ప్రేమగా తల పెట్టి పడుకోండి. ఉన్నవారి విలువ ఎప్పటికీ తెలియదు అంటారు అమ్మ లేని వారికి అమ్మ విలువ బాగా తెలుసు ఉన్నవారే ఆమెని నిర్లక్ష్యం చేస్తుంటారు. మీ సంపాదనతో మీ అమ్మకి ఒక్క జాకెట్ ముక్క కొనివ్వండి ఆమె కళ్ళల్లో చూసే ఆనందం మీరు జాగ్వార్ కారు కొన్నా పొందలేరు. మదర్స్ డే నాడు తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజు అల్లా ఆమెతో గడపగలిగితే అంతకు మించిన గిఫ్ట్ ఉండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి ఆమెతో తినిపించగలిగితే మాతృ రుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే. అలా కుదరని పక్షంలో స్వయంగా అమ్మకు రాసిన ఉత్తరాన్ని పంపండి. మరో విషయం మదర్స్ డే నాడు గుడికి వెళ్ళాల్సిన పనిలేదు. ఇంట్లో వెలిసివున్న మాతృదేవతకు నమస్కరించండి. మాతృదేవోభవ అన్న మాట గుర్తుండే ఉంటుంది కదా అందరిలో అగ్రపూజ్యం ఇవ్వాల్సింది అమ్మకే. ఈ ఏడాది నుండి అయినా అమ్మ ల పట్ల మీ దృక్పధం మారుతుందని ఆశిస్తూ….