పూర్తి ధాన్యాలతో కూడిన బ్యాలెన్స్డ్ డైట్, మంచి నిద్ర, ఎక్సర్సైజ్, ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత నీరు తాగుతూ ఉండడం వంటి కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా మీకు మంచి క్వాలిటీ స్కిన్ ని పొందుతారు. సో, ఏం తినాలో ఏం తినకూడదో చూసేయండి మరి.
ఒమేగా 3 పుష్కలంగా ఉన్న ఫుడ్స్ స్కిన్‌కి చాలా మేలు చేస్తాయి. ఇవి యూవీ రేస్ యొక్క హానికారక రేడియేషన్, స్మోకింగ్, పొల్యూషన్ వంటి వాటి నుండి స్కిన్ ని రక్షిస్తాయి. ముడతలు తగ్గించి డ్రై స్కిన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. ఒమేగా 3 లభించే పదార్ధాలు ఏమిటంటే ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్.
యూవీ డామేజ్ నించి స్కిన్ ని కాపాడడంలో విటమిన్ ఈ పాత్ర కూడా చెప్పుకోదగినదే. ఉసిరి, బాదం, అవకాడో, హేజిల్ నట్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ వంటి వాటి నుండి విటమిన్ ఈ లభిస్తుంది.స్కిన్ గ్లో కి అవసరమైన వాటిలో విటమిన్ ఏ కూడా ఉంటుంది. ఇది స్కిన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్‌ని సపోర్ట్ చేస్తుంది. యానిమల్ ప్రొటీన్, చిలగడదుంప, ఉడకించిన పాల కూర, క్యారెట్స్‌లో విటమిన్ ఏ లభిస్తుంది.
ఆల్కహాల్, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, రిఫైండ్ షుగర్ పూర్తిగా ఎవాయిడ్ చేయండి. క్రాష్ డైట్స్ వంటివి పూర్తిగా మానేయాలి. స్మోకింగ్, తగినంత నీరు తాగక పోవడం వంటి అలవాట్లని మార్చుకోవాలి.మీరు ఎంత మంచి మేకప్ వేసినా, స్కిన్ కేర్ సరిగ్గా లేకపోతే ఆ లుక్ రాదు. కాబట్టి, ఫెస్టివ్ స్కిన్ కేర్ గురించి ఏం చేయాలో తెలుసుకుందాం.
హైడ్రేషన్ స్కిన్ కి కావాల్సిన పోషణని అందిచి స్కిన్ కి మంచి హెల్దీ గ్లో తెస్తుంది. తగినంత నీరు లేకపోతే స్కిన్ డ్రైగా ఫ్లేకీగా తయారవుతుంది. పైగా, వయసు పెరుగుతున్న కొద్దీ స్కిన్ కొలాజెన్ ప్రొడ్యూస్ చేసే స్పీడ్ తగ్గిపోతుంది. కొలాజెన్ వల్లే స్కిన్ కి సాగే గుణం వస్తుంది. నీరు తాగడం వల్ల కొలాజెన్ ప్రొడక్షన్ సరిగ్గా జరుగుతుంది. కాబట్టి ముందు తగినంత నీరు, ఫ్లూయిడ్స్ తీసుకోవడం తో మీ స్కిన్ కేర్ రొటీన్ ని స్టార్ట్ చేయండి.
స్కిన్ ని రిజువినేట్ చేయాలంటే మంచి క్లెన్సింగ్ తప్పనిసరి. మీది డల్ స్కిన్ అయితే నాన్ డ్రైయింగ్, మైల్డ్ క్లెన్సర్ ని యూజ్ చేయడం మంచిది. స్కిన్ మీద ఉండే సహజమైన ఆయిల్‌ని తీసేయకుండా పోర్స్ ని క్లీన్ చేస్తుంది. రెగ్యులర్ గా స్కిన్ ని క్లెన్స్ చేయడం వల్ల స్కిన్ హెల్దీగా రేడియెంట్ గా ఉంటుంది. పైగా వయసు మీద పడే లక్షణాలని కూడా ఇది తగ్గిస్తుంది.
శీతాకాలం వచ్చేస్తోంది. వేడి వేడి నీటితో స్నానం మీదకి మనసు లాగేస్తూ ఉంటుంది. చలి గాలుల బద్ధకాన్ని వదిలించుకోవాలంటే వేడి వేడి స్నానం కంపల్సరీ అనిపిస్తుంది. కానీ, వేడి వేడి నీరు స్కిన్ ని డ్రై గా చేసేస్తుంది. అంతే కాక మీ మేకప్ కూడా కేకీగా కనపడుతుంది.
అబ్బో, ఇప్పుడు పార్లర్ కి ఎవరు వెళ్తారండీ బాబూ అంటున్నారా. అక్కరేదండీ, ఇంట్లోనే ఈజీగా వేసుకునే ఫేస్ మాస్క్స్ బోలెడున్నాయి. ఉదాహరణకి, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ లో రెండు టేబుల్ స్పూన్ల పాల మీగడ, చిటికెడు పసుపు కలిపి థిక్ పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని మీ ఫేస్, నెక్ కి అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. లేదా, రెండు టేబుల్ స్పూన్ల శనగ పిండి, ఒక టేబుల్ స్పూన్ పాల మీగడ, ఒక టీ స్పూన్ నిమ్మ రసం కలిపి ఫేస్ మాస్క్ వేయండి.
అయితే, ఈ మాస్క్ ని మాత్రం చల్లని నీటితో కడగాలి.ఎక్సర్సైజ్ వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ బయటకి వచ్చేస్తాయి. రోజూ అరగంట సేపు, వారం లో కనీసం ఐదు రోజులు ఎక్సర్సైజ్ చేస్తే స్కిన్ కి కూడా ఎంతో మంచిది.బ్యూటీ స్లీప్ కి ఆ పేరు ఉత్తనే రాలేదండోయ్.. నిద్ర వల్ల స్కిన్ రిలాక్స్ అవుతుంది. రిలాక్స్ అయితేనే కదా బ్యూటిఫుల్ గా కనిపించేది.