చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పిల్స్, క్రీమ్స్ వరకు వెళ్లక్కర్లేదు. కేవలం మన ఇంట్లో, మనం వండుకునే ఆహారంతో మనకు దొరికే పండ్లు, కూరగాయలతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. దీని వల్ల వేగంగా ముడతలు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. అయితే మరి మీరు కూడా వీటితో పరిష్కరించుకోవాలి అనుకున్నారా…? ఇంక ఆలస్యం ఎందుకు దీని మీద ఒక లుక్ వేసేయండి.
మంచి నీళ్లు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనకు తెలిసిందే. మన శరీరానికి నీళ్లు చాలా అవసరం. అయితే మీకు ఒక తెలియని విషయం చెప్తాను. అదేమిటంటే నీళ్లు తీసుకోవడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండి, ముడతలు రాకుండా ఉండడానికి సహాయం చేస్తుంది. ప్రతి రోజు సరిపడా నీళ్లు తాగడం వల్ల అందమైన నిగారింపు ఏర్పడటమే కాక ముఖంపై ముడతలు వేగంగా రాకుండా ఉండడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. కనుక ప్రతి రోజూ మీరు సరిపడా నీళ్లు తీసుకోండి.
సాధారణంగా మనకి బెర్రీస్ ఎక్కడో ఒక చోట దొరుకుతూనే ఉంటాయి. వీటిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇందులో అధిక యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. చర్మం సాగిపోకుండా ఉండడానికి బెర్రీస్ బాగా ఉపయోగ పడతాయి. కనుక మీరు ప్రతి రోజు బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, క్రాన్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ మరియు రాస్ప్ బెర్రీస్ ని మీ డైట్ లో చేర్చుకోండి.
ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ చర్మం ముడతలు పడకుండా ఉండడానికి ఉపయోగపడేలా చేస్తుంది. సర్క్యులేషన్ కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. శరీరానికి కావాల్సిన మినరల్స్ ని కూడా ఇస్తుంది. క్యాన్సర్ నుండి కూడా ఇది మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి వీటిని మీ డైట్ లో చేర్చడం మర్చిపోకండి.
కూరగాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముడతలు రాకుండా ఉండటానికి ఉపయోగపడే కూరగాయల గురించి ఇప్పుడు చూద్దాం…బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ లో ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ మరియు ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా బాగా ఉపయోగ పడతాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
లివర్ లో ఉండే హానికరమైన పదార్థాలను కూడా ఇవి తొలగిస్తాయి. రక్త ప్రసరణకు మరియు చర్మం కాంతివంతంగా ఉండడానికి బాగా సహాయ పడతాయి. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు సమస్యలు వస్తాయి. వాటిని కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి బాగా ఉపయోగ పడుతుంది. పైగా దీనిలో ఉండే ప్రోటీన్స్ చర్మం సాగిపోకుండా ఉండడానికి ఉపయోగ పడుతుంది మరియు విటమిన్ ఈ, ఫైటో న్యూట్రియంట్స్ కూడా ఆరోగ్యానికి ఎంత గానో మేలు చేస్తాయి కాబట్టి మీరు మీ డైట్ లో వీటిని కూడా చేర్చుకోండి.
నట్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని మీకు కూడా తెలుసు. వీటిలో మంచి కొవ్వు ఉంటుంది. వీటి వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు చర్మం నిగారింపు ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి మరియు సెలీనియం చర్మానికి బాగా మేలు చేస్తాయి.
రోజు గుప్పెడు నట్స్ ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాల్ నట్స్, బాదం పప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. చర్మాన్ని కూడా అందంగా, ముడతలు లేకుండా ఉండేట్టు చేస్తాయి.
అవకాడో లో కూడా క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. పైగా న్యూట్రియన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ చర్మం నిగారింపుగా ఉంచుతుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ప్రతి రోజు అవకాడో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండొచ్చు.
పూర్వకాలం నుండి అల్లాన్ని మనం అనేక విధాలుగా ఉపయోగిస్తూ ఉన్నాము. ఎన్నో చిన్న చిన్న సమస్యలను కూడా దీనితో పరిష్కరించుకోవచ్చు. నిజంగా అల్లాన్ని సూపర్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు. పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్న ఈ అల్లం లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. కనుక దీనిని తీసుకోవడం వల్ల ముడతలు త్వరగా రాకుండా ఉండడానికి సహాయ పడుతుంది.
మీరు ప్రతి రోజూ కొద్దిగా అల్లం నూనెను తీసుకుని మీ చర్మానికి అప్లై చేసి ఉంచితే మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. నిజంగా ఇది చర్మానికి ఎంత గానో మేలు చేస్తుంది. దీనితో మీరు యవ్వనంగా ఉండొచ్చు. మీ చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
చేపను కూడా మీ డైట్ లో తీసుకోవడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా, నిగారింపుగా ఉంటుంది. చేప లో లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చేపల్లో ఉండే నూనె చర్మానికి బాగా మేలు చేస్తుంది అనే చెప్పొచ్చు. దానిని కనుక ముఖానికి రాసుకుంటే యవ్వనంగా ఉండవచ్చు. పైగా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినడం వల్ల స్ట్రోక్ లాంటివి రాకుండా ఉండడానికి కాపాడుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ లాంటివి కూడా దీనిని తీసుకోవడం వల్ల మన దరిచేరవు. కాబట్టి దీనిని కూడా మీరు మీ డైట్ లో చేర్చుకోండి. అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
రెడ్ వైన్ ఆరోగ్యానికి, అందానికి కూడా బాగా మేలు చేస్తుంది. దీనిలో వుండే కాంపౌండ్స్ యవ్వనంగా ఉండడానికి సహాయ పడుతుంది. ప్రతి రోజు కొద్దిగా రెడ్ వైన్ తాగడం వల్ల ముడతలు రాకుండా నిత్యం యవ్వనంగా ఉండడానికి సహాయ పడుతుంది అని పరిశోధన లో తేలింది. కనుక యవ్వనంగా ఉండడానికి రెడ్ వైన్ కూడా తీసుకోవచ్చు.
చాక్లెట్లు ఎంత తిన్నా చిరాకు రావు. బోర్ కూడా కొట్టదు. ఎన్ని చాక్లెట్లు అయినా హాయిగా లాగించేయొచ్చు. ఇవి ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. అందుకేనేమో వీటిని స్ట్రెస్ బస్టర్స్ అంటారు. చాక్లెట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. కనుక చాక్లెట్ ని తినడం వల్ల చర్మం పై ముడతలు ఏర్పడకుండా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది. ప్రతి రోజు డార్క్ చాక్లెట్ ని మీ డైట్ లో చేర్చడం వల్ల మీరు యవ్వనంగా ఉండవచ్చు. ఇలా వీటి అన్నింటినీ మీ డైట్ లో చేర్చితే యవ్వనంగా ఉండొచ్చు.