చాలా మంది చుండ్రు సమస్యతో ఇబ్బంది పడతారు. ఇది చాలా కామన్ సమస్య. అయితే కొన్ని కొన్ని సార్లు పలు కారణాల వల్ల చుండ్రు ఎక్కువై పోతుంది. ముందు వాటి కోసం చూద్దాం ఆ తర్వాత మనం చుండ్రు పోగొట్టుకునే పద్ధతులు కూడా చూడొచ్చు.
వాతావరణం, ఒత్తిడి, మెడికల్ కండిషన్, హెయిర్ ప్రొడక్ట్స్, సొరియాసిస్, డెర్మటోసిస్ ఇలా వివిధ కారణాల వల్ల చుండ్రు పెరిగి పోయే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా శుభ్రత లేనప్పుడు కూడా చుండ్రు ఎక్కువగా ఉంటుంది. చుండ్రు పెచ్చులు కింద కట్టేస్తూ ఉంటుంది. ఒకవేళ వాడిన దువ్వెన శుభ్రంగా కడగకపోయిన లేదా తల స్నానం సరిగ్గా సమయానికి చేయక పోయినా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజు ఆయుర్వేద నిపుణులు కొన్ని ఆయుర్వేద చిట్కాలు చెప్పడం జరిగింది.
వాటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా చుండ్రు సమస్య నుండి మీరు బయట పడొచ్చు. ఇప్పటి వరకు మీరు వాడిన ప్రొడక్ట్స్ వల్ల ఫలితం లేక పోతే ఎటువంటి చింతా లేకుండా ఇలా మారండి. ఈ చిన్న చిన్న టిప్స్ మీకు బాగా ఉపయోగ పడతాయి.
దీనితో మీరు దీని నుంచి సులువుగా బయట పడవచ్చు. ఆయుర్వేద నిపుణులు చెప్పిన కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. తల మీద ఉండే చర్మం ఊడిపోతూ ఉంటుంది. ఒకవేళ కనుక చర్మం పొడిబారి పోతే అటువంటి సమయం లో చుండ్రు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చలి కాలం లో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అదే విధంగా సమయానుసారం జుట్టుని షాంపూ తో వాష్ చేయాలి. అలానే ఆయిల్ కూడా తలకి పెట్టడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని సార్లు ఇవి ఆలస్యం అయితే అప్పుడు సొరియాసిస్ లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలానే అస్తమానం షాంపు వాష్ చేయడం వల్ల మీ చర్మం ఇరిటేట్ అవుతుంది అలానే ఎక్కువ ఆయిల్ పెట్టినా సరే ఇబ్బందులు వస్తాయి. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా చుండ్రు వ్యాపించే అవకాశం ఉంది.
కాబట్టి వీటినన్నిటిని మీరు గమనించడం మంచిది. ఏ తప్పు అయితే మీరు చేస్తున్నారా వాటిని సరిదిద్దుకుని మీరు ఈ సమస్య నుండి బయట పడడానికి వీలవుతుంది. కాబట్టి ఒకసారి వీటిని మీరు చెక్ చేసుకోండి. దీనితో సమస్య నుండి బయట పడడానికి అవకాశం ఉంది.
ఎప్పటికప్పుడు మీ జుట్టుని మరియు మాడుని కూడా శుభ్రంగా ఉంచుకోండి. వారానికి రెండు నుంచి మూడు సార్లు షాంపూ తో తల స్నానం చేయండి. ఎక్కువ షాంపూలను కాకుండా ఒకటి లేదా రెండు షాంపులని మాత్రమే ఉపయోగించండి. ఒక షాంపూ నుండి మరొక షాంపూకి మరియు మళ్ళీ మరొక షాంపూను ఉపయోగించండి.
అదే విధంగా మీరు మిగిలిన రోజులు నీళ్లు తో మసాజ్ చేసి ఉంచుతూ ఉండండి. అలానే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు మీ డైట్ లో ఆరోగ్యకరమైన ఆహారం ఉండేటట్టు తీసుకోండి. సమతుల్యమైన ఆహారం తీసుకుంటే మరీ మంచిది ఒక వేళ కనుక చాలా ఎక్కువ చుండ్రు ఉంది అంటే అప్పుడు తప్పకుండా మెడిటేషన్ అవసరం పడుతుంది ఇది కూడా మీరు గమనించి తీరాలి.
కాబట్టి ఒకసారి వీటిని కూడా జాగ్రత్తగా గ్రహించి అనుసరించడం మంచిది. దీని వల్ల కూడా మీరు బెనిఫిట్స్ పొందవచ్చు.ఈ ఇంటి చిట్కాలుని కనుక మీరు అనుసరించారు అంటే చుండ్రు సమస్య ఉండదు. అయితే మరి ఇంకా ఆలస్యం లేకుండా ఈ హోమ్ రెమిడీస్ చూసేద్దాం. చుండ్రుతో ఎక్కువ బాధ పడేవాళ్ళు ఈ పద్ధతులు పాటిస్తే చుండ్రు వేగంగా తగ్గి పోతుంది అలాగే చుండ్రు వల్ల కలిగే ఇబ్బందులు కూడా మీకు రావు.
దీని కోసం మీరు కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేయండి. అదే విధంగా వేప ఆకులు, కరివేపాకులు తీసుకోండి. ఈ రెండింటినీ కూడా కొబ్బరి నూనెలో వేసేయండి. ఆ తర్వాత పక్కన పెట్టేసి చల్లబడిన తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి. అరగంట పాటు ఇలా ఉంచుకున్న తర్వాత షాంపూతో తల స్నానం చేసేయండి. దీని వల్ల మీకు మంచి రిలీఫ్ ఉంటుంది చుండ్రు కూడా తగ్గి పోతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు దీని వల్ల కలగవు. మీరు కావాలంటే ఈ నూనెని స్టోర్ చేసుకోవచ్చు. దీనితో మీరు వారం లో ఒకటి రెండు సార్లు ఈ క్రమంలో చేస్తూ ఉంటే దీని వల్ల మీకు ఈ సమస్య పోతుంది.
అదే విధంగా మెంతులు రాత్రి పూట నానబెట్టి వాటిని ఉదయాన్నే రుబ్బి తలకు పట్టించి ఒక గంట పాటు ఉంచుకున్న తర్వాత తల స్నానం చేస్తే మీకు మంచి పరిష్కారం కనబడుతుంది. ఈ చిట్కా కూడా మీకు చుండ్రు పోవడానికి ఉపయోగ పడుతుంది కాబట్టి ఈ విధంగా అనుసరించి చుండ్రును తగ్గించుకోవచ్చు.
అలానే మరొక చిట్కా కూడా చూద్దాం.. అదేంటంటే..? ఉసిరి పొడి, త్రిఫల ఈ రెండు పొడులు మనకి ఆయుర్వేదం షాప్‌లో దొరుకుతాయి. లేదు అంటే ఈ పొడులు మీరు ఇంట్లో తయారు చేసుకో వచ్చు. దీని కోసం మీరు కొద్దిగా ఉసిరి పొడి కొద్దిగా త్రిఫల చూర్ణం తీసుకోండి.
ఈ రెండింటిని నీళ్ళల్లో కలిపి మీరు మీ మాడు మీద అప్లై చేయొచ్చు. పూర్తిగా ఎండిపోయిన తర్వాత తల స్నానం చేయండి. ఇది కూడా మీకు చక్కటి పరిష్కారం చూపుతుంది. చుండ్రు తొలగి పోవడానికి ఇది కూడా మంచి పద్ధతి. పైగా దీని వల్ల కూడా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చుండ్రు వేగంగా తగ్గిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఇలా ఔషధ గుణాలు ఉన్న ఉసిరి త్రిఫల తో పరిష్కారం మీకు దొరుకుతుంది. ఇది ఇలా ఉండగా కొబ్బరి పాలు కూడా మంచి చేస్తాయి. చుండ్రు తగ్గడానికి ఇవి బాగా ఉపయోగ పడతాయి మీరు దీని కోసం కొద్దిగా కొబ్బరి పాలు తీసుకుని అందులో నిమ్మ రసం వేసుకోవాలి. వాటిని తలకి పట్టించి పూర్తిగా ఆరాక తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు నుంచి మీకు మంచి రిలీఫ్ ఉంటుంది.
అలానే కొబ్బరి నూనెలో కొద్దిగా ఉసిరి పొడి వేసుకుని మీ తల మీద అప్లై చేసుకోండి ఇది కూడా ఈజీ ప్రాసెస్. దీని వల్ల కూడా చుండ్రు నుంచి మీరు త్వరగా బయట పడడానికి వీలవుతుంది. అదే విధంగా చుండ్రు తొలగించడానికి పెసర పిండి కూడా బాగా ఉపయోగ పడుతుంది. దీని కోసం మీరు ఒక స్పూన్ పెసర పిండిని తీసుకుని మూడు స్పూన్ల పెరుగులో కలిపి తలకు పట్టించండి.
పూర్తిగా ఆరి పోయిన తర్వాత తల స్నానం చేయండి ఇది కూడా సులువుగా చుండ్రుని వదిలిస్తుంది ఈ హోం రెమడీస్ ని కనుక మీరు పాటించారంటే మీకు చుండ్రు సమస్య ఉండదు. త్వరగా ఈ సమస్య నుండి బయట పడడానికి ఇవి చక్కటి పరిష్కారాలు.