మనిషి శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర. ఆరోగ్యంగా జీవితం గడపాలంటే కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉండాలి. కానీ నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇవి చిన్నగా ఉండొచ్చు లేదంటే భారీ పరిమాణంలో ఉండొచ్చు. కాల్షియం ఆక్సలేట్‌తో ఈ రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల మూత్రవిసర్జనలో ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీలో రాళ్ల కారణంగా బరువు తగ్గడం, జ్వరం, పొత్తి కడుపు నొప్పి, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కిడ్నీ రాళ్లను సర్జరీ ద్వారా తొలగించొచ్చు. కానీ కొన్ని సహజ పద్ధతుల ద్వారా కిడ్నీ రాళ్లను బయటకు వెళ్లేలా చేయొచ్చు. నీరు ఎక్కువగా తాగడం వల్ల ఖనిజాలు, ఇతర మలినాలను బయటకు పంపడం కిడ్నీలకు తేలిక అవుతుంది.
కిడ్నీలకు హాని కలిగించే అనవసర వ్యర్థాలను బయటకు పంపడంలో నీరు సహకరిస్తుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు ఎక్కువగా నీరు తాగడం వల్ల మూత్రం ద్వారా రాళ్లు బయటకు వెళ్తాయి. కిడ్నీల నుంచి రాళ్లను బయటకు పంపడంలో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ మిశ్రమం ఎంతగానో ఉపకరిస్తుంది. రోజూ ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల సహజంగా రాళ్లను బయటకు పంపొచ్చు. ఆపిల్ సీడర్ వెనిగర్ లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ రాళ్లను చిన్న ముక్కలుగా విడగొడుతుంది. మూత్రాశయం గుండా రాళ్లు బయటకు రావడానికి ఇది దోహదం చేస్తుంది. ఆపిల్ సీడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల కిడ్నీల నుంచి ట్యాక్సిన్లు బయటకు వెళ్లి శుద్ధి అవుతాయి. రాళ్లు తొలగిపోయే వరకు రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సీడర్ వెనిగర్‌ను వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. దానిమ్మలో అనేక పోషకాలున్నాయి. దానిమ్మ రసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. కిడ్నీ రాళ్లను కూడా సహజంగా తొలగించడానికి ఉపకరిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.