‘హౌరాబ్రిడ్జ్‌’ రాధ గోపాల సాంగ్‌ రివ్యూ…

Howrah bridge movie Review of Radha Gopala Song

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా తెరకెక్కుతున్న ‘హౌరాబ్రిడ్జ్‌’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విడుదలైన రెండు టీజర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా ఈ చిత్రం పాట ఒకటి విడుదల చేయడం జరిగింది. శేఖర్‌ చంద్ర ట్యూన్‌ చేసిన ఈ ట్యూన్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. రాధా గోపాల అంటూ సాగే ఈ పాట చాలా బాగుందని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. వినసొంపుగా చాలా చక్కగా మంచి లిరిక్స్‌తో పాట ఉంది. కేవలం రెండు నిమిషాలు మాత్రమే ఉన్న పాట అయ్యో అప్పుడే అయిపోయిందా అనిపించేలా ఉంది.

హరిప్రియ పాడిన ఈ పాటకు సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు దక్కుతుంది. పాటను చక్కగా ట్యూన్‌ చేయడంతో పాటు, పాటకు తగ్గట్లుగా మంచి సింగర్‌ను ఎంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇక సినిమాలోని ఈ పాట కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా స్థాయి ఇంకా పెరిగి పోయిందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. యాదు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని చౌదరిల కాంబో రొమాంటిక్‌ సీన్స్‌ యూత్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి అంటూ దర్శకుడు యాదు చెబుతున్నారు.