టీజర్‌ రివ్యూ : యూత్‌లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘హౌరాబ్రిడ్జ్‌’

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Howrah Bridge Movie Teaser Review

రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరి జంటగా తెరకెక్కిన చిత్రం ‘హౌరాబ్రిడ్జ్‌’. పలు సినిమాల్లో నటించి మెప్పించిన రాహుల్‌ రవీంద్రన్‌ మరియు యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుని సినిమాల్లో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఫేంను సాధిస్తున్న ఛాందిని చౌదరిల రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ అయిన ఈ చిత్రం టీజర్‌ తాజాగా విడుదలైంది. టీజర్‌ చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా యూత్‌ ఆడియన్స్‌కు ఎక్కేస్తుందని అనిపిస్తుంది. యూత్‌కు కావాల్సిన అంశాలు అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నట్లుగా టీజర్‌ను చూస్తుంటేనే అనిపిస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని మద్య రొమాన్స్‌ కూడా అదిరిపోయింది.

టీజర్‌తోనే అంచనాలను పెంచిన ఈ సినిమాకు రేవన్‌ యాదు దర్శకత్వం వహించగా ఈఎంవీఈ సంస్థ ప్రతిష్టాత్మకంగా కథానుసారంగా మంచి నిర్మాణాత్మక విలువలతో సినిమాను నిర్మించడం జరిగింది. టీజర్‌ చూస్తుంటే చాలా కూల్‌గా, మంచి క్వాలిటీతో సినిమాను తెరకెక్కించినట్లుగా అనిపిస్తుంది. యూత్‌ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా ఈ సినిమాను ఖచ్చితంగా ఆధరిస్తారని నిర్మాతలు చెబుతున్నారు. త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి ట్రైలర్‌ను మరియు ఆడియోను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాతో రాహుల్‌ రవీంద్రన్‌ మరియు ఛాందిని చౌదరిల స్థాయి పెరగడం ఖాయం అని, వీరి జంటకు మంచి మార్కులు పడటంతో పాటు ఖచ్చితంగా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని శేఖర్‌ చంద్ర అందించిన సంగీతం హైలైట్‌గా నిుస్తుందని అంటున్నారు.