రాజు గారి గది 2… తెలుగు బుల్లెట్ రివ్యూ

Raju Gari Gadhi 2 Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నటీనటులు :    నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్ 
నిర్మాత :      ప్రసాద్ వి. పొట్లూరి 
దర్శకత్వం :     ఓంకార్ 
మ్యూజిక్ డైరెక్టర్ :  తమన్ ఎస్.ఎస్ 
 సినిమాటోగ్రఫీ :   దివాకరన్ 

దర్శకుడు ఓంకార్ రెండేళ్ల కిందట రాజు గారి గది అనే సినిమా తీసినప్పుడు దానిపై ఏ అంచనాలు లేవు. ఓ చిన్న సినిమాగా మొదలైన ఆ కామెడీ హారర్ మూవీ పెద్ద విజయమే సాధించింది. ఓంకార్ కి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు రాజు గారి గది 2 విషయానికి వచ్చేసరికి సీన్ మారిపోయింది. నాగార్జున , సమంత లాంటి స్టార్స్ ఇందులో చేశారు. ఇక పీవీపీ లాంటి సంస్థ ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకుంది. దీంతో రాజు గారి గది 2 మీద అంచనాలు పెరిగాయి. ఇది సీక్వెల్ అని ప్రచారంలో ఉన్నప్పటికీ ఆ సినిమాకి, ఈ సినిమా కధకి సంబంధం లేదు. రెండు సినిమాలు కామెడీ, హారర్ జానర్ లో ఉండటం మాత్రమే ఉమ్మడి పాయింట్. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన రాజు గారి గది 2 ఎలా వుందో చూద్దాం.

కథ…

అశ్విన్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ లు ఓ రిసార్ట్ నడుపుతూ వుంటారు. అయితే అక్కడ వారికి ఊహించని అనుభవాలు ఎదురు అవుతుంటాయి. దీంతో వారికి అక్కడ దయ్యం ఉందన్న అనుమానం వచ్చి భయంతో వణికిపోతారు. ఈ సమస్య నుంచి బయటపడేయమని వాళ్ళు ఓ చర్చి ఫాదర్ దగ్గరికి వెళతారు. అయితే అతడు అక్కడ వున్న శక్తి గురించి తెలుసుకోడానికి ఓ మెంటలిస్ట్ ( నాగార్జున ) ని కలవమని చెబుతాడు. మొహం చూసి మనసులో వున్నది చెప్పగలిగిన ఆ మెంటలిస్ట్ కి ఆ రిసార్ట్ లో పగతో రగిలిపోతున్న ఆత్మ ( సమంత ) ఉందని తెలుసుకుంటాడు. ఆ ఆత్మ కి పగ ఎందుకు, ఆమెకి అన్యాయం చేసింది ఎవరు, ఆ ఆత్మ ప్రతీకారం తీర్చుకుందా , చివరకు ఏమైంది తెలుసుకోవాలంటే రాజు గారి గది 2 చూడాల్సిందే.

విశ్లేషణ…

హారర్ కామెడీ థ్రిల్లర్ అంశాలు కలగలిపి ఓ స్టోరీ చేసుకోవడం ఎంతో కష్టం. ఆ బ్లెండ్ సరిగ్గా కుదిరితే భలే ఉంటుంది. ఎక్కడైనా తేడా వచ్చిందా మొదటికే మోసం వస్తుంది. అందుకే దర్శకుడు ఓంకార్ ఈ కథని స్క్రిప్ట్ గా మలచడంలో, దానికి స్క్రీన్ ప్లే చేయడం పెద్ద ఛాలెంజ్ . ఫస్ట్ హాఫ్ మొత్తం మంచి కామెడీ, హారర్, సస్పెన్స్ తో వినోదం పంచుతూనే రేసీ గా వెళుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఈ సినిమాకి ప్రాణం పోసిన నాగ్, సమంత క్యారెక్టర్స్ వస్తాయి. ఆ రెండు క్యారెక్టర్స్ ని మలిచిన తీరు చాలా బాగుంది. మరీ ముఖ్యంగా కొందరి దుర్మార్గం వల్ల నలుగురిలో నవ్వులపాలైన ఓ అమ్మాయి పడే వేదన ని సమంత బాగా చూపింది. కధలో సమకాలీన సమాజంలో వున్న పాయింట్ తోడవ్వడంతో ఆమె దీనికి బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే ఆ పాత్ర చేసేటప్పుడు గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు పెట్టగలిగింది. ఇక ఎదుటి వారి మనసుని చదివే క్యారెక్టర్ లో నాగ్ భలే చేసాడు. అయితే ఈ సినిమా మాతృక మలయాళ సినిమా ” ప్రేతం” లో లోటుపాట్లు సరిచేసుకునే అవకాశం వున్నా ఓంకార్ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదనిపిస్తుంది. ప్రూవ్డ్ సబ్జెక్టు ని ఫాలో అయిపోయినట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సినిమా ఇంకా బాగుండేది.
సినిమా లో కెమెరా పనితనం బాగుంది. సినిమాటోగ్రాఫర్ దివాకరన్ బాగా తీసాడు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది.

ప్లస్ పాయింట్స్ …

కామెడీ
కెమెరా , ఎడిటింగ్ ,మ్యూజిక్
నాగార్జున , సమంత

మైనస్ పాయింట్స్ …

స్క్రీన్ ప్లే లో పాత పోకడ
గ్రాఫిక్స్

తెలుగు బులెట్ పంచ్ లైన్… రాజు గారి గది 2 టైటిల్ తో సినిమాకి సంబంధం లేదు.
తెలుగు బులెట్ రేటింగ్… 3 / 5 .