ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హృతిక్ ‘ది కపిల్ శర్మ షో’కి వెళ్లి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో హృతిక్‌కు జోడీగా అమీషా పటేల్ నటించారు. ఈ సినిమా విడుదలయ్యాక హృతిక్, అమీషాలకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. అంతేకాదు ఐఫా ఫెస్టివల్లో గత 20 ఏళ్లలో ‘కహో నా ప్యార్ హై’ను మించిన మరో సినిమా మరేదీ లేదన్న కాంప్లిమెంట్ను దక్కించుకుంది. అంత మంది అమ్మాయిలు హృతిక్ కోసం ఎగబడినప్పటికీ ఆయన మాత్రం సుసాన్నే ఖాన్‌ను ఇష్టపడ్డారు. ‘కహో నా ప్యార్ హై’ సినిమా విడుదలకు ముందే హృతిక్, సుసాన్నే రిలేషన్ షిప్లో ఉన్నారు. హృతిక్ తన సినిమా కెరీర్‌ను స్టార్ట్ చేసినప్పుడే సుసాన్నేను పెళ్లి చేసుకుని ఎందరో ఆడపిల్లల హృదయాలను బద్దలకొట్టారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ కొన్నేళ్ల తర్వాత హృతిక్, సుసాన్నేకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. హృతిక్‌కు మరో హీరోయిన్‌తో సంబంధం ఉందన్న కారణంతో సుసాన్నే ఆయన్ను వదిలేశారని బాలీవుడ్ టాక్.
అలా 2014లో హృతిక్, సుసాన్నే విడాకులు తీసుకున్నారు. అయినప్పటికీ పిల్లల కోసం తరచూ కలుసుకుంటూ ఉన్నారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు, డిన్నర్ పార్టీలకు, సినిమాలక వెళుతూ ఉంటారు. మరో విషయం ఏంటంటే.. హృతిక్, కంగనా రనౌత్ మధ్య ఎంతటి మాటల యుద్ధం జరిగిందో అందరికీ తెలిసిందే. హృతిక్ తనను ప్రేమించి మోసం చేశారని కంగన ఆరోపించారు. దాంతో హృతిక్‌కి కోపం వచ్చి తనను సినిమాల్లో తీసుకోనివ్వకుండా చేశారని కంగన ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అలా ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఇంత జరిగినప్పటికీ సుసాన్నే.. తన మాజీ భర్త హృతిక్కే మద్దతు తెలిపారు. తనకు హృతిక్‌తో ఎంతటి పర్సనల్ గొడవలు ఉన్నా మరో అమ్మాయితో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించారంటే తాను నమ్మనని సుసాన్నే వెనకేసుకొచ్చారు.