హృతిక్ రోషన్ ప్రేమలో పడ్డాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కుర్ర కథానాయిక సబా ఆజాద్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడాన్ని బట్టి వారిద్దరూ కచ్చితంగా లవ్‌లో ఉన్నారని అంటున్నారు. ఈ మధ్య తరచూ డిన్నర్, లంచ్ డేట్లకు కలిసి వెళ్లడం, కెమెరాలకు కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడాన్ని చూస్తుంటే వీళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయ్యిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తాజాగా హృతిక్ ఫ్యామిలీని కలిసింది సబా. ఈమేరకు హృతిక్ అంకుల్ రాజేశ్ రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యామిలీ ఫొటో వదిలాడు. ‘సంతోషం అనేది ఎల్లప్పుడూ మా చుట్టూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆదివారం, అందులోనూ మధ్యాహ్న భోజన సమయంలో!’ అని దానికి కాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలో హృతిక్ కుటుంబసభ్యులందరితో పాటు సబా కూడా ఉంది. ఈ పోస్ట్‌పై హృతిక్ స్పందిస్తూ.. ‘అవును చాచా, ఇది మాత్రం వాస్తవం. నువ్వైతే భలే నవ్విస్తావ్’ అని రిప్లై ఇచ్చాడు. సబా కూడా ‘అద్భుతమైన ఆదివారం’ అంటూ కామెంట్ వదిలింది. హృతిక్ ఈసారి సబాను ఏ రెస్టారెంట్‌కు తీసుకెళ్లకుండా ఏకంగా ఇంటికే వెంటపెట్టుకు వెళ్లాడన్నమాట అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.