తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. ప్రతిపక్ష పార్టీ గా కూడా సరైన రీతిలో జవాబిచ్చే పరిస్థితిలో లేదు. అయితే ఎన్నికల తరువాత టీడీపీ లో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. అంతర్గత విభేదాలతో పార్టీ ఇంకా దారుణస్థితికి పడిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన సంఘటన టీడీపీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుందో తెలియజేస్తుంది. కడప పర్యటనలో వున్నా చంద్రబాబు అక్కడి నియోజకవర్గ సమస్యలను, పార్టీ తీరు గురించి సమీక్షించే సమయం లో సుబ్బయ్య, శ్రీనివాస్ రెడ్డి లు చంద్రబాబు ఎదుటే గొడవ పడ్డారు. దాడికి కూడా దిగడం జరిగింది.
చంద్రబాబు ఎదుటే గొడవపడిన బాబు ఏ మాత్రం స్పందించలేదు. ఈ విషయంలో సుబ్బయ్య ఫై శ్రీనివాస్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేయడం తో రిమ్స్ పోలీస్ స్టేషన్ లో సుబ్బయ్య ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఫై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇలాంటి సంఘటనలు రాష్ట్రమంతటా జరుగుతున్నా అందరు బయటికి వచ్చి చెప్పే అవకాశం లేదు. ఇలాంటి గొడవలు ఇపుడు పెరగడం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మనుగడ అసాధ్యమే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.