Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Human Sacrifice For Kaleswaram telangana Project
తెలంగాణలో ప్రాజెక్టుల కోసం నరబలులిస్తున్నారా. అంటే అవునంటున్నారు కొందరు అవుట్ సైడర్స్. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ తమ పని సక్సెస్ కావాలని ఒడిషాకు చెందిన కార్మికుడ్ని బలిచ్చిందన్న ఘటన కలకలం రేపుతోంది. అయితే ఈ వ్యవహారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. అసలు ఈ కాలంలో నరబలి ఉందా.. లేదా అనేది చర్చనీయాంశమైంది.
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కోసం ఒడిషాకు చెందిన కార్మికులు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. పనులు జరుగుతున్న చామనపల్లి ప్రాంతం నుంచి అతడు ఏడాది క్రితం అదృశ్యమయ్యాడు. అయితే తన కుటుంబాన్ని కలవడానికి వెళ్లి ఉంటాడని తోటివారు అనుకున్నారు. కానీ అతడు అక్కడా లేడని కుటుంబం నుంచి సమాచారం రావడంతో.. అందరూ అలెర్టయ్యారు.
దీంతో స్థానికులు కొంతమంది నరబలి ప్రచారం మొదలుపెట్టారు. దీంతో పోలీసులు సత్వరమే విచారణ మొదలుపెట్టి కొందర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. పంప్ హౌస్ వద్ద నరబలి ఇచ్చారన్న ప్రచారంతో.. అక్కడ కార్మికుడ్ని పూడ్చిపెట్టారనే ప్రచారంతో.. అధికారులు అలర్టయ్యారు. అక్కడ తవ్వి శవాన్ని వెలికితీయాలని చూస్తున్నారు. అయితే ఇది నిజమైతే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందికరమే అంటున్నారు విశ్లేషకులు.