అదనపు కట్నం కావాలంటూ వేధించడమే కాకుండా, తన స్నేహితులతో గడపాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడో దుర్మార్గపు భర్త. ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, కట్టుకున్న భార్యను చిత్ర హింసలు గురిచేశాడు. భర్త వేధింపులు తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించారు ఆ మహిళ. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన మహిళ(40) అదే నగరానికి చెందిన రియాజ్ 2002 లో వివాహం చేసుకున్నారు. కట్నంగా 50 తులాల బంగారాన్ని ఇచ్చారు. వివాహం జరిగిన ఆరు నెలల తరువాత, అదనపు కట్నంగా మరోక కారు, మరిన్ని డబ్బులు ఇవ్వాలని వేధించారు. ఆ తర్వాత కూడా మళ్లీ ఎక్కువ మొత్తంలో డబ్బులు తేవాలని ఒత్తిడి తెచ్చాడు.
అలాగే తన స్నేహితులతో గడపాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీనికి నిరాకరించిన ఆమెపై దాడికి దిగాడు. దీంతో ఆమె అహ్మదాబాద్ మహిళా పోలీసులను ఆశ్రయించారు. తన భర్త ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకొని, తనను ఆయన స్నేహితులతో గడపాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.