భార్యతో గొడవపడి ఓ భర్త, తన కుమారుడితో అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలానికి చెందిన ప్రసాద్ బతుకుదేరువు కోసం పటాన్‌చెరు జెపి కాలనీకి వచ్చాడు. కూలీ పనులు పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 8న భార్య సాయవ్వతో గొడవపడి తొమ్మిదేళ్ల కుమారుడు రామకృష్ణను తీసుకొని ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వారి కోసం తెలిసిన వారు, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో సాయవ్వ పోలీసులను ఆశ్రయిచింది. సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.