అయితే తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెంలో పేద కుటుంబంలో పుట్టిన దివ్య చిన్న వయసులోనే తల్లి, తమ్ముడు, అమ్మమ్మ హత్యకు గురయ్యారు. దాంతో విశాఖ నగరంలోని ఎన్ఏడీ కూడలి వద్ద ఉంటున్న గీత వద్దకు చేరింది. దివ్య అందాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని గీత మాయమాటలతో వ్యభిచార కూపంలోకి దింపింది. అయితే కొద్ది నెలల తర్వాత అక్కడి నుంచి దివ్య పారిపోయి సొంతూరు చేసుకుంది. అక్కడ ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన వీరుబాబుతో బంధువులు పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరబాబు దివ్యను చిత్ర హింసలకు గురి చేసేవాడు. దీంతో మళ్లీ దివ్యను తీసుకువచ్చి గీతకు అప్పగించాడు. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్న దివ్య తర్వాత అక్కయ్యపాలెంలోని వసంత అలియాస్ జ్యోతి వద్దకు చేరింది. అక్కడ వారికి వాటాల్లో గొడవ జరగటంతో జ్యోతి… దివ్యను చిత్ర హింసలకు గురి చేసింది. ఆరు రోజులపాటు తిండి పెట్టకుండా నానారకాలుగా కుల్లపొడిచింది. ఆ తర్వాత హత్య చేసింది. ఈ కేసులో ప్రస్తుతం పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అలాగే.. మిగతా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపట్టారు.