భర్త మిలిటరీలో …భార్య ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం…అనుమానంతో హత్య ! 

Husband in the military ... Wife has improper relationship with auto driver ... Suspected murder!

నేటి రోజుల్లో వివాహేతర బంధాలు పచ్చటి సంసారాలలో చిచ్చు పెడుతున్నాయి. పడక సుఖం కోసం కన్న బిద్దలనే కాక కట్టుకున్న వారిని కూడా వదిలి పోవడానికి కూడా వెనకాడడం లేదు కొందరు. తాజాగా అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్న ప్రియురాలిని కత్తితో పొడిచి చంపిన వ్యక్తి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

వారి అక్రమ సంబంధం ఇద్దరి చావుతో విషాదంగా ముగిసింది. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరానికి చెందిన గీతారాణి(38) అనే మహిళకు గతంలో ఆర్మీ జవానుతో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త దేశ సరిహద్దుల్లో పహారా కాస్తుంటే గీతారాణి మాత్రం ఆటోడ్రైవర్‌గా పనిచేసే హమీద్(36) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ విషయం తెలిసిన భర్త గీతారాణి నుంచి విడిపోయాడు. వారి బంధం గురించి తెలిసిన హమీద్ భార్య కూడా భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో అడ్డు తొలగిపోయిందనుకున్న ఆ జంట ఓ ఇల్లు అద్దెకు తీసుకుని మరీ సహజీవనం చేస్తున్నారు. ఇటీవల గీతారాణి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న హమీద్ ఆమెను వేధిస్తున్నారు.

గురువారం ఇంట్లోనే ఆమెపై కత్తితో దాడి చేసి ఛాతి, తల నడుము భాగాల్లో చాకుతో పొడిచాడు. పెద్దగా కేకలు చేసుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చిన గీతారాణిని స్థానికులు చిత్తూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో భయపడున హమీద్ కూడా దుర్గానగర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో విషం తాగి పడిపోయాడు.